మాయ మాటలతో బాత్‌రూమ్‌లోకి పిలిచి.. ఐదేళ్ల బాలికపై స్వీపర్ రేప్

Delhi Rape Incident : అత్యాచార ఘటనపై స్పందించిన డిప్యూటీ కమిషనర్ విజయ్ కుమార్.. సదరు స్వీపర్ 2008 నుంచి స్కూల్లో పనిచేస్తున్నట్టు చెప్పారు. అతనిపై చాలా ఫిర్యాదులు వచ్చాయని.. అతని బాధితులే చాలామందే ఉండవచ్చునన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.

news18-telugu
Updated: August 14, 2019, 10:12 AM IST
మాయ మాటలతో బాత్‌రూమ్‌లోకి పిలిచి.. ఐదేళ్ల బాలికపై స్వీపర్ రేప్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎన్ని చట్టాలు చేసినా.. ఎంత కఠిన శిక్షలు అమలుచేస్తున్నా.. దేశంలో అత్యాచార ఘటనలకు మాత్రం తెరపడటం లేదు. తాజాగా ఢిల్లీలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 5 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది.స్కూల్లో స్వీపర్‌గా పనిచేస్తున్న వ్యక్తే ఈ అఘాయిత్యానికి తెగబడ్డాడు. బాలిక ఉదంతం వెలుగులోకి రావడంతో.. మరికొందరు బాలికలు సైతం ధైర్యంగా నోరు విప్పారు. గతంలో తమ పట్ల కూడా స్వీపర్ అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత బాలికలు తెలిపారు. అత్యాచార ఘటనపై స్పందించిన డిప్యూటీ కమిషనర్ విజయ్ కుమార్.. సదరు స్వీపర్ 2008 నుంచి స్కూల్లో పనిచేస్తున్నట్టు చెప్పారు. అతనిపై చాలా ఫిర్యాదులు వచ్చాయని.. అతని బాధితులే చాలామందే ఉండవచ్చునన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.బాలికల వాష్‌రూమ్స్ క్లీన్ చేయడానికి మగ వ్యక్తిని ఎందుకు పెట్టారని స్కూల్ యాజమాన్యాన్ని కూడా ప్రశ్నించినట్టు డిప్యూటీ కమిషనర్ తెలిపారు.

తాజా ఘటనలో బాధిత బాలికకు పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి రావడంతో తల్లికి అసలు విషయం చెప్పిందని.. దాంతో బాలిక దుస్తులు తీసి పరిశీలించగా.. ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్టు గుర్తించిందని తెలిపారు. ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించగా.. బాలిక అత్యాచారానికి గురైందని నిర్దారించిందన్నారు. బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించగా పలు విషయాలు వెల్లడించిందన్నారు. స్వీపర్ తనకు మాయ మాటలు చెప్పి పలుమార్లు నిర్మానుష్య ప్రదేశాలకు,బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లినట్టు చెప్పిందన్నారు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలియజేశారు.

First published: August 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...