Home /News /crime /

SWEDISH WOMAN SUSPECTED OF LOCKING UP SON FOR 28 YEARS WITNESS SAYS PLACE SMELLED ROTTEN NS

కన్న కొడుకుకే నరకం చూపించిన కసాయి తల్లి.. 28 ఏళ్లుగా గదిలో బంధించి చిత్ర హింసలు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఓ తల్లి ఏకంగా తన కన్న కొడుకునే దారుణంగా హింసించింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 28 ఏళ్ల పాటు నరకం చూపెట్టింది. అతడిని ఓ గదిలో బంధించి తన శాడిజం ప్రదర్శించింది. సరైన తిండి కూడా పెట్టకుండా అతడిని వేధించింది.

    సవతి తల్లులు పిల్లలను చిత్ర హింసలకు గురి చేస్తూ ఇబ్బంది పెట్టిన వార్తలు మనం ఎక్కడో చోట వింటూనే ఉంటాం. కానీ ఓ తల్లి ఏకంగా తన కన్న కొడుకునే దారుణంగా హింసించింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 28 ఏళ్ల పాటు నరకం చూపెట్టింది. అతడిని ఓ గదిలో బంధించి తన శాడిజం ప్రదర్శించింది. సరైన తిండి కూడా పెట్టకుండా అతడిని వేధించింది. దీంతో ఆరోగ్యం దెబ్బతిని, నోట్లో పళ్లు అన్నీ ఊడి పోయి అత్యంత దీన స్థితిలోకి చేరాడు. ఆ మహిళ బంధువు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ బాధితుడికి 28 ఏళ్ల తర్వాత విముక్తి లభించింది. స్వీడన్ లో జరిగిన ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. 28 ఏళ్ల క్రితం 12 సంవత్సరాల వయస్సు ఉన్న తన కుమారుడిని ఓ తల్లి స్కూల్ మాన్పించింది. అనంతరం అతడిని ఇంట్లోని ఓ గదిలో బంధించింది.

    అప్పటి నుంచి అతని భోజనం, నిద్ర, బాత్రూం అంతా అక్కడే సాగేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతని గదిని ఒక్క సారి కూడా శుభ్రం చేయలేదంటే ఆ కన్న తల్లి ఎంత కఠినాత్మురాలో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవల ఆ మహిళ అనారోగ్యానికి గురి కావడంతో బంధువులకు తెలిసింది. దీంతో ఆ మహిళ ఉండే అపార్టుమెంట్ కు ఓ బంధువు వచ్చాడు. అయితే అక్కడ ఆ ధీన స్థితిలో ఉన్న ఆమె కుమారుడిని చూసి వారు షాక్ అయ్యాడు. దీంతో అతను పోలీసులకు విషయాన్ని తెలిపాడు. అనంతరం అంబులెన్స్ సహాయంతో ఆ బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.

    అయితే ఆ బాధితుడిని చూసిన పోలీసులే కన్నీరు పెట్టుకున్నారు. దీన్ని బట్టి అతను ఎలాంటి స్థితితో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అతడిని పరీక్షించిన డాక్టర్లు ప్రాణానికి ప్రమాదం లేదని వెల్లడించారు. బాధితుడి నోటిలో పళ్లే లేవని గుర్తించారు. అతడి శరీరంపై ఉన్న గాయాల వల్ల ప్రాణాలకు ప్రమాదం లేదని.. మానసికంగా అతను కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ విషయం గురించి పోలీసులు చుట్టు పక్కల వారిని ప్రశ్నించగా.. ఆ వృద్ధ మహిళ ఎవరినీ ఇంటికి రానిచ్చేది కాదని చెప్పారు. కొడుకు గురించి అడిగితే మీకేందుకు అంటూ గొడవపడేదని పోలీసులకు తెలిపారు. ఈ విషయపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మహిళను అరెస్టు చేశారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Jail, Sweden

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు