నగ్నంగా దొరికిన క్రిమినల్... తెలివిగా అరెస్ట్ చేసిన న్యూడ్ పోలీస్...

మఫ్టీలో స్టీమ్ బాత్ స్పా సెంటర్‌కు వెళ్లిన పోలీస్ అధికారి... బట్టలన్నీ విప్పేసిన తర్వాత... ఎదురుగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 3, 2019, 10:06 PM IST
నగ్నంగా దొరికిన క్రిమినల్... తెలివిగా అరెస్ట్ చేసిన న్యూడ్ పోలీస్...
నగ్నంగా దొరికిన క్రిమినల్... తెలివిగా అరెస్ట్ చేసిన న్యూడ్ పోలీస్...(నమూనా చిత్రం)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 3, 2019, 10:06 PM IST
ఎవ్వరైనా క్రిమినల్‌ అడ్డంగా బుక్కైతే రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు అంటారు. అయితే ఆ దొంగ మాత్రం నగ్నంగా దొరికాడు. అతన్ని పట్టుకున్న పోలీస్ కూడా నగ్నంగానే పట్టుకున్నాడు. ఒంటి మీద నూలుపోగు లేకుండా జరిగిన ఈ సంఘటన రోడ్డు మీద కాదు లెండి. స్టీమ్ బాత్ స్పా సెంటర్‌లో! సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ సంఘటన స్వీడెన్‌లో జరిగింది. స్వీడెన్‌లోని స్టాక్‌హోమ్‌ ఏరియాకు చెందిన ఓ పోలీస్ ఆఫీసర్... డ్యూటీ ముగిసిన తర్వాత కాస్త ఉపశమనం పొందుదామని మఫ్టీలో స్టీమ్ బాత్ స్పా సెంటర్‌కు వెళ్లాడు. ఆవిరి స్నానం చేసేందుకు బట్టలన్నీ విప్పేసిన తర్వాత... ఎదురుగా నిల్చున్న వ్యక్తిని చూశాడు. కాస్త జాగ్రత్తగా గమనించి చూడగా అతను ఓ డ్రగ్స్ సప్లై కేసులో అరెస్ట్ అయ్యి, కస్టడీ నుంచి తప్పించుకుని తిరుగుతున్న మోస్ట్ వాంటెట్ క్రిమినల్ అని గుర్తించాడు. వెంటనే అతన్ని పట్టుకోవాలని అనుకున్నాడు. అయితే పోలీస్ అధికారి ఒంటిపై నూలుపోగు లేదు. ఎదురుగా నిల్చున్న క్రిమినల్ కూడా నగ్నంగా ఉన్నాడు.

అరెస్ట్ చేసేందుకు ఆయుధాలు గానీ, పోలీసులకు సమాచారం ఇవ్వడానికి మొబైల్ ఫోన్ గానీ అందుబాటులో లేదు. అయితే ఆ సమయంలోనే ఏ మాత్రం కంగారు పడకుండా సమన్వయం పాటించిన పోలీసు... అయితే కలిసి కాసేపు ఆవిరి స్నానాన్ని ఆస్వాదించాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి జారుకుని ఫోన్ తీసుకుని, సిబ్బందికి సమాచారం అందించారు. అధికారి ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు... అతను బయటికి రాగానే అరెస్ట్ చేశారు. ఈ వింత సంఘటనను సోషల్ మీడియాలో పెట్టాడు సదరు అధికారి. ఈ పోస్ట్ కొద్దిసేపట్లోనే వైరల్ అవుతోంది.First published: April 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...