Home /News /crime /

SUV SKIDS OFF ZUARI RIVER IN GOA ALL PASSENGERS DECLARED DEAD PAH

OMG: కళ్లముందే ఘోరం.. బ్రిడ్జ్ మీద మరో కారును ఓవర్ టేక్ చేయబోయి..

కారు బయటకు తీస్తున్న అధికారులు

కారు బయటకు తీస్తున్న అధికారులు

Goa: వంతెన మీద కారు వేగంగా ప్రయాణిస్తుంది. ఇంతలో ఎదురుగా వెళ్తున్న కారును ఓవర్ టెక్ చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు ఎస్‌యూవీ ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పింది.

కొన్ని రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో.. రోడ్లన్ని బురదమట్టితో నిండిపోయాయి. అనేక చోట్ల రోడ్లపై కంకర తేలింది. దీంతో వెహికిల్స్ బ్యాలెన్స్ తప్పుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ కోవకు చెందిన ఘటన గోవాలో (Goa)  జరిగింది. రాష్ట్ర రాజధాని పనాజీకి 15 కిలోమీటర్ల దూరంలోని కోర్టాలిమ్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఉన్న జువారీ నది వంతెనపై కారును ఓవర్‌టేక్ చేసేందుకు ఎస్‌యూవీ ప్రయత్నించగా, వంతెన రెయిలింగ్‌లను ఢీకొని నదిలోకి దూసుకెళ్లింది. గురువారం తెల్లవారుజామున గోవాలోని జువారీ వంతెనపై నుండి కారు స్కిడ్ అయి జువారీ నదిలోకి పడిపోయింది.

దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోవా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, భారతీయ నావికాదళానికి చెందిన డైవర్లు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు. మీడియా నివేదికల ప్రకారం, రాష్ట్ర రాజధాని పనాజీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోర్టాలిమ్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఉన్న జువారీ నది వంతెనపై కారును ఓవర్‌టేక్ చేయడానికి SUV ప్రయత్నించింది. అది వంతెన రెయిలింగ్‌లను ఢీకొని నదిలోకి పడిపోయింది.



ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, వాహనంలో కనీసం నలుగురు వ్యక్తులు ఉన్నారని, దానిని ఒక మహిళ నడుపుతోందన్నారు. "గోవా పోలీసులు కోస్ట్ గార్డ్ నౌక, బార్జ్‌లు, అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బందితో కలిసి వాహనాన్ని గుర్తించడానికి ఆపరేషన్ ప్రారంభించారు. అయితే చీకటి కారణంగా రాత్రి దానిని కనుగొనలేకపోయారని పోలీసు అధికారి తెలిపారు. ఈ వంతెన మార్గోవ్ (దక్షిణ గోవా) పనాజీ నగరాల మధ్య జాతీయ రహదారిపై ఉంది. కాగా, జువారీ వంతెన ఉత్తర, దక్షిణ గోవాల మధ్య ఒక ముఖ్యమైన కనెక్టర్ గా ఉంది.

తమ టీచర్ క్లాస్ కు రావడానికి విద్యార్థులు చేసిన పని వైరల్ గా మారింది.

ఉత్తర ప్రదేశ్ లోని  (Uttar pradesh) మధుర జిల్లాలో జరిగిన ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. స్థానికంగా ఉన్న పాఠశాలలో వరద నీరు భారీగా వచ్చి చేరింది. స్కూల్ ఆవరణలో భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో.. టీచర్ తమ స్కూల్ లోపలికి రాలేక తీవ్ర ఇబ్బందులు పడింది. అప్పుడు విద్యార్థులంతా ఒక ఐడియా వేశారు.

క్లాస్ కు వెళ్లి అక్కడ ఉన్న ప్లాస్టిక్ చేయిర్ లను తీసుకొచ్చారు. వాటిని విద్యార్థులంతా కలసి వరుసగా పెట్టారు. దానిపైన ఎక్కి టీచర్ ను క్లాస్ కు రమ్మన్నారు. అప్పుడు టీచర్ కుర్చీ మీద ఎక్కి ఒక్కొ.. కుర్చీ దాటుకుంటూ తరగతి గదికి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు.. వావ్.. విద్యార్థుల ఐడియా భలే ఉందంటూ కామెంట్ లు పెడుతున్నారు
Published by:Paresh Inamdar
First published:

Tags: Goa, Road accident

తదుపరి వార్తలు