మిస్టరీ : ఆ ఇంట్లో దిగిన రెండు రోజులకే మృతి.. ఏమై ఉంటుంది?

కొద్దిరోజులు పేయింగ్ గెస్ట్‌గా ఉన్న అతను.. ఈ నెల 7వ తేదీన జూబ్లీహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంటులో మూడో అంతస్తులో అద్దెకు దిగాడు. ఖయ్యుం అనే ఓ ఏజెంట్ ద్వారా ఆ ఇంట్లో దిగాడు.

news18-telugu
Updated: October 12, 2019, 11:03 AM IST
మిస్టరీ : ఆ ఇంట్లో దిగిన రెండు రోజులకే మృతి.. ఏమై ఉంటుంది?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ నెల 7వ తేదీన అద్దెకు దిగిన చిత్ర అరసు(29) అనే యువకుడు.. 9వ తేదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అరసు రక్తపు మడుగులో పడి ఉండటం.. బాత్‌రూమ్‌లోనూ రక్తపు మరకలు ఉండటంతో.. ఇది హత్యా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల కథనం ప్రకారం.. చెన్నైలోని పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా అరసు పనిచేస్తున్నాడు. ఈ ఏడాది అతనికి హైదరాబాద్‌,జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్ నగర్‌కు ట్రాన్స్‌ఫర్ అయింది. ప్రాజెక్ట్ మేనేజర్‌గా పదోన్నతి కూడా లభించడంతో అరసు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు.కొద్దిరోజులు పేయింగ్ గెస్ట్‌గా ఉన్న అతను.. ఈ నెల 7వ తేదీన జూబ్లీహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంటులో మూడో అంతస్తులో అద్దెకు దిగాడు. ఖయ్యుం అనే ఓ ఏజెంట్ ద్వారా ఆ ఇంట్లో దిగాడు. అయితే ఆ మరుసటి రోజే జ్వరంతో బాధపడుతున్నట్టు ఖయ్యుంకు ఫోన్ చేశాడు.దీంతో వెంకటగిరిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించారు.

మరుసటిరోజు ఉదయం 11గంటలకు ఖయ్యుంకు ఫోన్ చేసిన అరసు మెట్ల పైనుంచి పడ్డానని,ఆస్పత్రికి తీసుకెళ్లానని వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. ఖయ్యుం వేరే పనిలో ఉండి మధ్యాహ్నం అరసు వద్దకు వెళ్లాడు.అప్పటికే అరసు రక్తపుమడుగులో పడి ఉన్నాడు. హుటాహుటిన నిమ్స్‌కు తరలించినప్పటికీ..అప్పటికే అతను మృతి చెందినట్టు నిర్దారించారు. అరసు ఉంటున్న ఇంట్లో బాత్‌రూమ్‌లోనూ రక్తపు మరకలు ఉండటంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే వైరల్ ఫీవర్ కారణంగానే రక్తస్రావం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించినట్టు తెలిపారు.

First published: October 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>