హోమ్ /వార్తలు /క్రైమ్ /

Telangana: నిర్మల్‌లో 4నెలల పసిబిడ్డకు తల్లి దూరం .. అతడే ఏదో చేశాడని అందరి డౌట్

Telangana: నిర్మల్‌లో 4నెలల పసిబిడ్డకు తల్లి దూరం .. అతడే ఏదో చేశాడని అందరి డౌట్

(వివాహిత అనుమానాస్పదమృతి)

(వివాహిత అనుమానాస్పదమృతి)

Suspicious death:నిర్మల్‌లో వివాహిత మృతి కలకలం రేపుతోంది. రెండేళ్ల క్రితం పెద్దల్ని ఎదిరించి స్రవంతిని పెళ్లి చేసుకున్నాడు వెంకటేష్. ఆదివారం భార్యకు ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి తీసుకెళ్తే డాక్టర్లు చనిపోయిందన్నారు. మృతురాలి శరీరంపై గాయాలుండటంతో భర్తే చంపాడంటున్నారు బంధువులు.

ఇంకా చదవండి ...

(K.Lenin,News18,Adilabad)

ప్రేమిస్తున్నారు. ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు. ఆ తర్వాత నుంచి వరకట్న వేధింపుల పేరుతో కొందరు, వేరే పెళ్లి కోసం ఇంకొందరు కట్టుకున్న భార్యను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్(Adilabad)జిల్లాలో ఈమధ్యకాలంలోనే ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. నేరడిగొండ(Neradigonda)మండలంలో అదనపు కట్నం కోసం యువతిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారు మెట్టినింటివాళ్లు. ఇది జరిగిన 24గంటల్లోనే మంచిర్యాల(Manchiryala)జిల్లా దండేపల్లి(Dandepalli)మండలానికి చెందిన ఓ మహిళా వైద్యురాలు హైదరాబాద్‌(Hyderabad)లో భర్త, అత్త,మామలు వరకట్న వేధింపులకు బలైపోయింది. ఈ దారుణం జరిగిన గంటల వ్యవధిలోనే నిర్మల్(Nirmal)జిల్లా కేంద్రంలో మరో వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.

వివాహిత ఒంటిపై గాయాలు..

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆసరా కాలనీలో నివాసముండే గొల్లపల్లి స్రవంతి అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మృతురాలి స్వస్థలం బోథ్. అదే ప్రాంతానికి చెందిన వెంకటేష్ రెండేళ్ల క్రితం స్రవంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం నిర్మల్‌లోని ఆసరా కాలనీలో నివాసముంటున్నారు. ఈదంపతులకు నాలుగు నెలల పసిపాప ఉంది. ఆదివారం ఉదయం వెంకటేష్‌ స్రవంతిని జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో పరిశీలించిన డాక్టర్లు స్రవంతి అప్పటికే మృతి చెందినట్లుగా ధృవీకరించారు.

(వివాహిత అనుమానాస్పదమృతి)

అనుమానాస్పదమృతి..

మృతురాలి ఒంటిపై గాయాలు ఉండటం, భర్తే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో బంధువులు వెంకటేష్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా స్రవంతిని వెంకటేషే చంపాడని ఆరోపిస్తున్నారు. తమ బిడ్డకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని..ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటున్నారు. రెండు సంవత్సరాల క్రితం తాము వద్దని చెప్పినప్పటికి వెంకటేష్‌ తమ బిడ్డను ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకున్నాడని..ఇప్పుడు ఇంత పని చేశాడని కన్నీటిపర్యంతమవుతున్నారు.

భర్తపైనే డౌట్..

స్రవంతి, వెంకటేష్‌ వేర్వేరు సామాజికవర్గాలకు చెందిన వాళ్లు కావడంతో పెళ్లికి స్రవంతి పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆమెను పెళ్లి చేసుకొని నిర్మల్‌లో కాపురం పెట్టారని బంధువులు తెలిపారు. మృతురాలి శరీరంపై గాయాలుండటంతో భర్తే చంపి ఉంటాడని ఆరోపిస్తున్నారు. తల్లి చనిపోవడంతో స్రవంతి బిడ్డ 4నెలల పసికందును చూపి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు ఆసుపత్రిలో స్రవంతి మృతదేహాన్ని పరిశీలించారు. బంధువుల వాదనను పరిశీలనలో తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

First published:

Tags: Nirmal district, Women died

ఉత్తమ కథలు