హోమ్ /వార్తలు /క్రైమ్ /

నిర్భయ దోషుల ఉరి.. కేసులో మరో ట్విస్ట్..

నిర్భయ దోషుల ఉరి.. కేసులో మరో ట్విస్ట్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిర్భయ దోషుల ఉరితీత కేసులో మరో ట్విస్ట్ తగిలింది. జనవరి 22న దోషులను ఉరి తీయలేమని ఢిల్లీ సర్కారు హైకోర్టుకు తెలిపింది.

  నిర్భయ దోషుల ఉరితీత కేసులో మరో ట్విస్ట్ తగిలింది. జనవరి 22న దోషులను ఉరి తీయలేమని ఢిల్లీ సర్కారు హైకోర్టుకు తెలిపింది. క్షమాభిక్ష పిటిషన్, ఉరిశిక్ష అమలు మధ్య 14 రోజుల పాటు గడువు ఉండాలని.. అందువల్ల 22న ఉరి సాధ్యం కాదని స్పష్టం చేసింది. రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉంది.. దానిపై రెండు వారాల్లో రాష్ట్రపతి నిర్ణయం వెలువరించనున్నారు. కాగా, తీహార్ జైలు అధికారుల తీరుపై హైకోర్టు మండిపడింది. పిటిషన్‌ను ఆలస్యం ఎందుకు చేశారని తీహార్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నిర్భయ దోషుల ఉరి ఆలస్యం కానుంది. ఇదిలా ఉండగా, నిర్భయ దోషుల క్యూరేటివ్ పిటిషన్లను నిన్న సుప్రీం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. దీనిపై నిర్భయ తల్లి స్పందిస్తూ .. దోషులను ఉరితీసే రోజే తమ జీవితంలో అసలైన పండగ రోజని అన్నారామె.

  2012లో నిర్భయపై సామూహిక అత్యాచారం చేసి, చంపిన నేరస్థులు ముకేష్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31)లను జనవరి 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరితీయాలని పాటియాల కోర్టు ఆదేశించింది.  దీంతో దోషుల్లో వినయ్, ముఖేష్ చివరి ప్రయత్నంగా సుప్రీంను ఆశ్రయించారు. ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వీరి పిటిషన్‌ను విచారించి.. కొట్టివేసింది.

  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  Tags: National News, Nirbhaya, Supreme Court

  ఉత్తమ కథలు