
ప్రతీకాత్మక చిత్రం
సస్పెండెడ్ జడ్జి రామకృష్ణను మదనపల్లి టూటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తన చిన్నమ్మ చనిపోయిన తర్వాత ఆమె చెక్కులను ఫోర్జరీ చేసి వాటిని తన అప్పులు తీర్చుకునేందుకు వినియోగించేందుకు ఆయన ప్రయత్నించినట్టు పోలీసులు తెలిపారు.
చిన్నమ్మ చనిపోయిన తరువాత.. ఆమె చెక్కులను వక్రమార్గంలో ఐదుగురికి జారీ కేసులో సస్పెండెడ్ జడ్జి రామకృష్ణను మదనపల్లి టూటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపడుతున్నాని పోలీసులు తెలిపారు. సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ చిన్నమ్మ సుచరిత (65)కు పిల్లలు లేకపోవడంతో.. ఆయన ఇంట్లోనే ఉండేది. జూన్ 6, 2019న ఆమె చనిపోయింది. రామకృష్ణ.. తన అప్పులను తీర్చేందుకు ఐదుగురికి.. ఆమె చెక్కులు ఇచ్చాడు. ఈ చెక్కులపై చనిపోయిన సుచరిత సంతకం ఉంది. దీంతో కెనరా బ్యాంకు మేనేజర్ కిరణ్ కుమార్ ఆగస్టు 6,2020న మదనపల్లి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె చనిపోయిన తరువాత చెక్కులు ఇష్యూ కావడంతో పోలీసులను ఆశ్రయించానని.. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫొరెన్సిక్ రిపోర్టు, మరణ ధృవీకరణ పత్రాలను డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌గా పోలీసులు చూపించారు. దీంతో రామకృష్ణపై పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయనపై బి.కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి.
Published by:Ashok Kumar Bonepalli
First published:December 11, 2020, 22:42 IST