Home /News /crime /

SUSPECTING THAT HIS WIFE MIGHT BE HAVING AN AFFAIR WITH SOMEONE LEADS TO HER ELIMINATION SSR

Bengaluru: ఈమె లైఫ్‌లో ఇలాంటి ఒకరోజు వస్తుందని కలలో కూడా ఊహించి ఉండదు.. విషాద ఘటన..

ఆశా (ఫైల్ ఫొటో)

ఆశా (ఫైల్ ఫొటో)

తమిళనాడుకు చెందిన మణి, ఆశా(35)కు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన కొన్నాళ్లు ఆశాతో మణి అన్యోన్యంగానే ఉన్నాడు. భార్యను బయటకు తీసుకెళుతూ.. సినిమాలకుషికార్లకు తీసుకెళుతూ ప్రేమగానే చూసుకున్నాడు. పదేళ్ల క్రితం ఆశా, మణి బతుకుదెరువు నిమిత్తం బెంగళూరు నగరానికి వెళ్లారు.

ఇంకా చదవండి ...
    బెంగళూరు: భార్యపై భర్త అనుమానం ఆమె నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నిద్రపోతున్న భార్య గొంతు కోసి ఆమెను అతి కిరాతకంగా హతమార్చాడు ఆ కసాయి భర్త. బెంగళూరు నగరంలోని హులిమావు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన మణి, ఆశా(35)కు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన కొన్నాళ్లు ఆశాతో మణి అన్యోన్యంగానే ఉన్నాడు. భార్యను బయటకు తీసుకెళుతూ.. సినిమాలకుషికార్లకు తీసుకెళుతూ ప్రేమగానే చూసుకున్నాడు. పదేళ్ల క్రితం ఆశా, మణి బతుకుదెరువు నిమిత్తం బెంగళూరు నగరానికి వెళ్లారు. చెరో పని చేసుకుంటూ బాగానే ఉన్నారు. కానీ.. కొన్ని నెలల నుంచి మణి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఆశా తను పనిచేసే దగ్గర ఎవరితోనో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానం మణిలో బలపడింది. ఆమెకు తెలియకుండా ఫోన్‌ చెక్ చేయడం, కాల్ రికార్డ్‌ను చూడటం వంటి పనులు చేశాడు. భర్త తనను అనుమానిస్తున్న విషయం తెలియడంతో ఆశా అతనితో గొడవ పడింది. ఇద్దరి మధ్య ఈ మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఎవరితోనో అఫైర్ నడుపుతున్నావని ఆశాను మణి వేధించసాగాడు. తాగొచ్చి భార్యతో గొడవ పెట్టుకునేవాడు. ఈ క్రమంలోనే.. సోమవారం రాత్రి కూడా మణి మద్యం సేవించి ఇంటికొచ్చాడు. ఆశాతో గొడవపెట్టుకున్నాడు. ఎవరితో సంబంధం నడుపుతున్నావో చెప్పాలని రచ్చరచ్చ చేశాడు. ఆమెను నోటికొచ్చినట్లు తిడుతూ హంగామా చేశాడు.

    మణి


    కొంతసేపటికి ఆశా భర్త ప్రవర్తనతో విసిగిపోయి నిద్రపోయింది. అలా నిద్రిస్తున్న భార్యపై కోపంతో ఊగిపోతూ.. మద్యం మత్తులో ఉన్న మణి ఆశా గొంతు కోశాడు. ఆ తర్వాత తలుపులేసి పడుకుని నిద్రించాడు. మంగళవారం ఉదయం ఎంత పొద్దెక్కినా ఆశా బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానమొచ్చింది. రోజూ భార్యతో మణి గొడవపడుతుండటాన్ని చూసిన ఇరుగుపొరుగు వాళ్లు ఏదో చేసి ఉంటాడనే అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు.

    ఇది కూడా చదవండి: EX Lovers: లాక్‌డౌన్‌ వల్ల భార్యాపిల్లలతో సొంతూరికి క్యాబ్ డ్రైవర్.. ఊళ్లో కనిపించిన మాజీ లవర్.. చివరకు ఏమైందంటే..

    పోలీసులు మణి ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో ఆశా మృతదేహం కనిపించింది. గొంతు దగ్గర తీవ్ర గాయమై కత్తితో గొంతు కోసి హతమార్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. పోలీసులు మణిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆమెను తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. ఎందుకు చంపావని పోలీసులు అడగ్గా.. తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం నడుపుతుందని.. అది నచ్చకే చంపానని మణి పోలీసులకు చెప్పాడు. పోలీసులు మణిపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Bangalore, Bengaluru, Crime news, Extra marital affair, Husband, Wife

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు