వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భర్తపై మరిగే నూనె పోసిన భార్య

ప్రతీకాత్మక చిత్రం

భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడనన సమాచారంతో ఓ మహిళ నిద్రిస్తున్న భర్తపై వేడి నూనెతో పోసింది. దీంతో ఆ భర్తకు 50 శాతం గాయాలయ్యాయి. అనంతరం పిల్లలతో కలిసి పారిపోయింది.

  • Share this:
    వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో నిద్రిస్తున్న భర్తపై ఓ భార్య మరుగుతున్న నూనెను పోసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోన్న మంజునాథ్(40) తన కుటుంబంతో యశ్వంత్‌పూర్‌లోని మోహన్‌కుమార్ నగర్‌లో ఉంటున్నాడు. తన భార్య పద్మతో 9 సంవత్సరాల క్రితం వివాహం కాగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే మంజునాథ్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భర్తతో తరచూ గొడప పడుతుండేది. గత శనివారం కూడా ఈ విషయమై భార్యభర్తలిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో దాదాపు లీటరు మరుగుతున్న వేడి నూనెను తన భర్త మంజునాథ్‌పై పోసి.. పిల్లలతో కలిసి పద్మ పారిపోయింది. వేడినూనెకు కాలిన గాయాలతో అరుస్తూ ఇంటి బయటకు వచ్చిన మంజునాథ్‌ను స్థానికులు ఓ ఆస్పత్రిలో చేర్చారు. అయితే మంజునాథ్‌కు ప్రాణాప్రాయం తప్పినా.. శరీరం 50 శాతం కాలిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Vijay Bhaskar Harijana
    First published: