బర్త్ డే కేక్‌లో విషం కేసు.. మృతుడు రాంచరణ్ బాబాయ్ అరెస్ట్..

రమేష్-శ్రీనివాస్‌ల మధ్య కొంతకాలంగా భూ తగాదాలు నడుస్తున్న నేపథ్యంలో.. శ్రీనివాసే కేక్‌లో విషం కలిపి పంపించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.స్థానికులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

news18-telugu
Updated: September 5, 2019, 10:58 AM IST
బర్త్ డే కేక్‌లో విషం కేసు.. మృతుడు రాంచరణ్ బాబాయ్ అరెస్ట్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సిద్దిపేట జిల్లా ఐనాపూర్‌లో బర్త్ డే కేక్ విషాదం నింపిన ఘటనలో అనుమానితుడు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సోదరుడు రమేష్ కొడుకు రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీనివాసే కేక్ పంపించాడు. ఆ కేక్ తిన్న తర్వాత రమేష్,రాంచరణ్ మృతి చెందగా.. రమేష్ భార్య భాగ్యలక్ష్మి,కుమార్తె పూజితల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భాగ్యలక్ష్మి,పూజితల పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలనుకున్న పుట్టినరోజు కాస్త.. ఆ కుటుంబంలో తీరని విషాదం మిగిల్చినట్టయింది.రమేష్-శ్రీనివాస్‌ల మధ్య కొంతకాలంగా భూ తగాదాలు నడుస్తున్న నేపథ్యంలో.. శ్రీనివాసే కేక్‌లో విషం కలిపి పంపించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.స్థానికులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించనున్నారు. విచారణలో అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : బర్త్ డే కేక్ నింపిన విషాదం.. తండ్రీ కొడుకులు మృతి..
First published: September 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading