హోమ్ /వార్తలు /క్రైమ్ /

Suryapet: మహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ.. ప్లాన్ వేసింది కోడలే.. అందుకోసమే హత్య..

Suryapet: మహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ.. ప్లాన్ వేసింది కోడలే.. అందుకోసమే హత్య..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో  5 రోజుల క్రితం జరిగిన వ‌ద్ధ మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. ఆ మహిళను ఆమె కోడలే హత్య చేసినట్టుగా గుర్తించారు.

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో  5 రోజుల క్రితం జరిగిన వ‌ద్ధ మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. ఆ మహిళను ఆమె కోడలే హత్య చేసినట్టుగా గుర్తించారు. ఇందుకు సైదులు అనే వ్యక్తి సహకరించినట్టుగా నిర్దారించారు. దీంతో వారిద్దరిని రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. సూర్యాపేట మండలం కుసుమవారి గూడెంకు చెందిన వీరారెడ్డి, లలితమ్మ(65) భార్యాభర్తలు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు మధుసూదన్‌రెడ్డి ఉన్నాడు. ఇద్దరు కూతుళ్లు, కొడుకుకు పెళ్లిళ్లు కూడా చేసింది. కొడుకు మధుసూదన్‌రెడ్డి.. భార్య విజయలక్ష్మి, ఇద్దరు కొడుకులతో కలిసి సూర్యాపేటలో ఉంటున్నాడు. అక్కడే దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు.

లలితమ్మ తన కుమార్తెలకు చెరో రెండు ఎకరాల పొలం ఇచ్చింది. మిగిలిన 3.24 ఎకరాల భూమి వీరారెడ్డి పేరున ఉంది. అయితే ఏడాది క్రితం వీరారెడ్డి చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత లలితమ్మ ఒంటరిగానే నివాసం ఉంటుంది. అయితే లలితమ్మ ఆమె వద్ద ఉన్న డబ్బును కూతుళ్లకు ఇస్తుందని విజయలక్ష్మి గొడవ పడుతూ ఉండేంది. మిగిలిన భూమిని తన భర్త పేరు మీద పట్టా చేయాలని లలితమ్మను అడిగిన ఫలితం లేకుండా పోయింది. దీంతో భూమిని ఎలాగైనా తాను దక్కించుకోవాలని భావించింది. ఈ క్రమంలోనే అత్త లలితమ్మను హత్య చేయాలనే నిర్ణయానికి వచ్చింది.

ఇందుకు తనతో చనువుగా ఉండే పెన్‌పహాడ్‌ మండలం అనాజీపురానికి చెందిన సైదులు సాయం తీసుకుంది. దీంతో ఇద్దరు కలిసి లలితమ్మను చంపేందుకు ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 9న రాత్రి సమయంలో కుసుమవారిగూడెంలో సైదులు లలితమ్మను హత్య చేశాడు. ఇందుకు సంబంధించి మధుసూదన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక, అత్తను హత్య చేయించిన విజయలక్ష్మి మాత్రం తనకేం సంబంధం లేనట్టుగా ఉంటూ వచ్చింది.

అయితే విచారణలో భాగంగా తరుచూ వారింటికి వచ్చే సైదులను పోలీసులు విచారించారు. దీంతో అతడు లలితమ్మను హత్య చేసినట్టు అంగీకరించాడు. దీంతో పోలీసులు విజయలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె కూడా నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు ఆమెతో పాటు, సైదులును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇక, సైదులు నుంచి రెండు తులాల బంగారు చైన్‌, రెండు ఇత్తడి గాజులు, ఒక సెల్‌ఫోన్‌, టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ సూపర్‌ ద్విచక్రవాహనం, హత్య చేయటానికి ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకన్నారు.

First published:

Tags: Crime news, Murder, Suryapet

ఉత్తమ కథలు