సూర్యపేటలో ఘోర ప్రమాదం... రోడ్డుపైనే రెండు కార్లు దగ్ధం

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వస్తున్న ఇండికా కారు డివైడర్‌ దాటి వచ్చి ఢీ కొట్టింది.

news18-telugu
Updated: October 22, 2019, 1:16 PM IST
సూర్యపేటలో ఘోర ప్రమాదం... రోడ్డుపైనే రెండు కార్లు దగ్ధం
రొడ్డుపై దగ్ధమవుతున్న కార్లు
  • Share this:
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మునగాల మండలం మాధవరం శివారులో జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఓ వార్తాపత్రిక రిపోర్టర్‌ తన భార్యతో కలిసి కోదాడ నుంచి హైదరాబాద్‌ వైపు కారులో వస్తున్నారు. ఇంతలో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వస్తున్న ఇండికా కారు డివైడర్‌ దాటి వచ్చి ఢీ కొట్టింది. రెండు కార్లు పరస్పరం ఢీకొట్టుకోగానే మంటలు చెలరేగాయి. రోడ్డుపైనే రెండు కార్లూ పూర్తిగా దగ్ధమాయ్యయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నలుగురికి చికిత్స నిమిత్తం పోలీసులు కోదాడలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.



ఇవికూడా చూడండి:
పాటపాడుతూ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న పోలీస్

First published: October 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading