గోమాత కడుపులో 52 కేజీల ప్లాస్టిక్...ఆపరేషన్ చేసిన వైద్యులు షాక్...

శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించగా దాదాపు ఐదున్నర గంటల పాటు శ్రమించి ఆవు శరీరంలో నుంచి 52 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించినట్లు వైద్యులు తెలిపారు.

news18-telugu
Updated: October 21, 2019, 10:34 PM IST
గోమాత కడుపులో 52 కేజీల ప్లాస్టిక్...ఆపరేషన్ చేసిన వైద్యులు షాక్...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 21, 2019, 10:34 PM IST
పాలిచ్చే గోమాత కడుపులను ప్లాస్టిక్ భూతం తినేస్తోంది. తాజాగా తమిళనాడు వెటర్నరీ అండ్ ఏనిమల్ సైన్సెస్ యూనివర్శిటీ వైద్యులు ఓ ఆవు కడుపులో దాదాపు 52 కేజీల ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలను తొలగించారు. కొన్ని రోజుల క్రితం ఇనిస్టిట్యూట్‌లో అనారోగ్యంగా ఉన్న ఓ ఆవు పొట్టలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్టు వెటర్నరీ వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించగా దాదాపు ఐదున్నర గంటల పాటు శ్రమించి ఆవు శరీరంలో నుంచి 52 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు ఆవు కడుపులో రెండు స్క్రూలు, ఒక కాయిన్ కూడా ఉన్నాయని సర్జన్లు తెలిపారు. కాగా ఆవును ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, కొన్ని రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలని డాక్టర్లు తెలిపారు.

Loading...First published: October 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...