ధోని నాకు మద్దతిచ్చాడు నిజమే.. కానీ.. సురేశ్ రైనా కీలక వ్యాఖ్యలు..

టీమిండియాలో నిలదొక్కుకోవడానికి మహేంద్ర సింగ్ ధోని తనకు మద్దతు ఇచ్చింది నిజమేనని, అయితే.. తనలో ఉన్న ప్రతిభను గుర్తించే ధోని మద్దతు ఇచ్చాడని సురేశ్ రైనా అన్నాడు.

news18-telugu
Updated: May 28, 2020, 8:19 AM IST
ధోని నాకు మద్దతిచ్చాడు నిజమే.. కానీ.. సురేశ్ రైనా కీలక వ్యాఖ్యలు..
సురేష్ రైనా
  • Share this:
టీమిండియాలో నిలదొక్కుకోవడానికి మహేంద్ర సింగ్ ధోని తనకు మద్దతు ఇచ్చింది నిజమేనని, అయితే.. తనలో ఉన్న ప్రతిభను గుర్తించే ధోని మద్దతు ఇచ్చాడని సురేశ్ రైనా అన్నాడు. ధోనికి రైనా ఫేవరెట్ అని యువరాజ్ ఇటీవల వ్యాఖ్యానించాడు. 2011 ప్రపంచకప్‌ సందర్భంగా రైనా పెద్దగా ఫామ్‌లో లేడని, ధోని మద్దతుతో తుది జట్టులో ఆడాడని యువీ అన్నాడు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన రైనా.. ‘ధోని నాకు మద్దతు ఇచ్చాడు అనడంలో సందేహం లేదు. నాలో ప్రతిభ ఉందని తెలుసు కాబట్టే అతడు నాకు అండగా ఉన్నాడు. ధోని నాయకత్వంలో టీమిండియా, చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున సత్తా చాటాను’ అని అన్నాడు. ఆటలో విఫలమైతే ధోని ఎవ్వరినైనా హెచ్చరిస్తాడని, తనను కూడా హెచ్చరించాడని చెప్పాడు. మళ్లీ ఆ తప్పులు చేయనని ధోనికి చెప్పేవాడినని అన్నాడు.
First published: May 28, 2020, 8:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading