Husband Kills Wife : ఈ మధ్య ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. హత్య, అఘాయిత్యాలు న్యూస్‌లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలను కూల్చుతున్నాయి. నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. యి. ఈ జిల్లా ఆ జిల్లా అన్న తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు వేలం వెర్రిగా బయటపడుతున్నాయి. అన్నింట్లోనూ వివాహేతర సంబంధాలదే ప్రధాన భూమికగా మారింది. తాత్కాలిక సంతోషం, సుఖం కోసం ఎంతో మంది వివాహేతర సంబంధాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధం అన్నది ఇద్దరు వ్యక్తులకు సంబంధించినదే అయినప్పటికీ దాని ఫలితాలు, పర్యవసానాలు ఎన్నో జీవితాలతో ముడిపడి ఉంటాయన్న విషయాన్ని ప్రజలు గుర్తించడం లేదు. కొన్ని నిమిషాల ఆనందం కోసం జీవితాన్ని, కుటుంబాన్నే పనంగా పెడుతున్నారు. ఇటీవల కాలంలో ఒకటి... రెండు కాదు.. వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో హత్యలు జరిగాయి. వీటివల్ల ఎన్నో కుటుంబాలు ఛిద్రమయ్యాయి. అయితే తాజాగా గుజరాత్ లో ఇలాంటి సంఘటన మరొకటి చోటుచేసుకుంది. వేరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త. కత్తితో ఆమె గొంతుకోసి,పలుమార్తు ఆమెను పొడిచి దారుణంగా చంపాడు. సూరత్ లోని దిండోలి ఏరియాలో మంగళవారం ఈ ఘటన జరిగింది.
సూరత్ లోని దిండోలి ఏరియాలో సురుబా జలా-హన్సభా దంపతులు నివసిస్తున్నారు. సురుబా ఓ టైక్స్ టైల్ వ్యాపారి. వీరికి 19ఏళ్ల కుమారుడు,16ఏళ్ల కూతురు ఉంది. అయితే కొంతకాలంగా తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందేమోనన్న అనుమానం సురుబాలో ఉంది. ఇదే విషయమై పలుమార్లు భార్యను నిలదీశాడు. అయితే అలాంటిది ఏమీ లేదని,తనకు ఎవిరితోనూ ఎఫైర్ లేదని హన్సభా భర్తకు తేల్చిచెప్పింది. అయినప్పటికీ భర్తలో అనుమానం పోలేదు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇంటికి వచ్చిన సురుబా..తనకు ఎవరూ సాయం చేయట్లేదు అని ఏడవడం మొదలుపెట్టాడు. తనకు ఆకలిగా ఉందని,బజారుకి వెళ్లి ఏవైనా తినడానికి తీసుకురమ్మని కుమారుడికి డబ్బులు ఇచ్చాడు. తండ్రి ఆకలితో ఉన్నాడని నమ్మిన ఆ యువకుడు స్కాన్స్ కొని తెచ్చేందుకు బజారుకి వెళ్లాడు. ఆదే సమయంలో కూతురు కూడా స్ననానికి వెళ్లింది.
ALSO READ Affair : వివాహేతర సంబంధం..మహిళను కరెంట్ పోల్ కి కట్టేసి దారుణంగా
దీంతో చిన్నగా బెడ్ రూమ్ లోకి వెళ్లాడు సురుబా. బెడ్ రూమ్ డోర్ లాక్ చేసి..రూమ్ లో ఉన్న భార్యపై తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. కత్తితో ఆమె మెడ దగ్గరకోసి,పలుమార్తు ఆమె కడుపులో పొడిచాడు. కాపాడండి అంటూ తల్లి అరుపుు వినిపించి కంగారుపడి వచ్చినా రూమ్ లాక్ చేసి ఉండంతో ఏం చేయలేకపోయింది. కొద్ది సేపటి తర్వాత బజారు నుంచి వచ్చిన కుమారుడు తన దగ్గర ఉన్న మరో తాళంతో డోర్ తెరిచి చూడగా రక్తపుమడుగులో పడి ఉన్న తల్లి కనిపించింది. అప్పటికే ఈమె చనిపోయింది. అయితే భార్యను హత్య చేసిన వెంటనే కిటికీలో నుంచి తప్పంచుకున్నాడు భర్త సురుబా. నేరుగా లాయర్ దగ్గరికి వెళ్లాడు సురుబా. అయితే పిల్లలు ఇచ్చిన సమాచారంతో సురుబా కోసం గాలించిన పోలీసులు..అథ్వా లైన్స్ వద్ద అతడిని అరెస్ట్ చేశారు. మర్డర్ సహా పలు సెక్షన్ కింద అతడిపై కేసు నమోదుచేశారు.
గడిచిన మూడు నెలలుగా సురుబాకి భార్యతో తీవ్రమైన విభేధాలు ఉండినాయని,ఏప్రిల్ 12న భార్యపై కత్తితో దాడికి యత్నించాడని,అప్పుడు అతడి కుమారుడు ఇచ్చిన సమాచారంలో పోలీస్ బృందం వారి ఇంటికి సకాలంలో చేరుకొని ఆమెను రక్షించిందని దిండోలి పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ సలుంకే తెలిపారు. ఆ ఘటన తర్వాత కుటుంబానికి తూరంగా ఉంటూ వచ్చిన సురుబా..ఈ సారి తన పిల్లలను ఫూల్స్ చేసి..భార్యపై మరోసారి దాడి యేసి ఆమెను చంపేశాడని పోలీసులు తెలిపారు. మూడు నెలల క్రితం భార్య ఫోన్ ను సురుబా దొంగిలించాడని,అందులోని కొన్ని ఫొటోలు,మెసేజ్ ల ద్వారా తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందేమోనని సురుబా అనుమానించాడని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Extra marital affair, Gujarat