పెళ్లి తర్వాత శారీరక సంబంధం కొనసాగించాలని...కీచక మేనమామ బ్లాక్ మెయిల్

గత మూడు మాసాలుగా ఆ యువతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. విషయం తెలుసుకున్న మేనమామ...పెళ్లి తర్వాత కూడా తనతో శారీరక సంబంధం కొనసాగించాలని ఆ యువతిపై ఒత్తిడి తీసుకొచ్చాడు.

news18-telugu
Updated: August 2, 2020, 1:01 PM IST
పెళ్లి తర్వాత శారీరక సంబంధం కొనసాగించాలని...కీచక మేనమామ బ్లాక్ మెయిల్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మేనకోడలితో ప్రైవేటుగా గడిపిన క్షణాలను మొబైల్ ఫోన్‌లో వీడియో తీసి బ్లాక్ మెయింగ్‌కు పాల్పడిన కీచక మేనమామపై పోలీసులు కేసు నమోదుచేశారు. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...గుజరాత్‌లోని సౌరాష్ట్రకు చెందిన ఓ యువతి సూరత్‌లో నివాసముంటూ చీరలపై లేస్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తోంది.  ఈ పనిని  ఆమె మేనమామ కరణ్ (30) ప్రతిరోజూ ఇంటికి వచ్చి ఆమెకు నేర్పించాడు. దాదాపు ఏడాది పాటు ఇలా అతను రోజూ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. మాయమాటలతో మేనకోడలిని కరణ్ లొంగదీసుకున్నాడు. అతన్ని గుడ్డిగా నమ్మిన ఆమె...అతనితో శారీరక సంబంధం పెట్టుకుంది. ఆమెతో ఏకాంతంగా గడిపిన క్షణాలను మొబైల్ ఫోన్‌తో వీడియో చిత్రీకరించాడు కరణ్.

ఈ నేపథ్యంలో మూడు మాసాల క్రితం నుంచి ఆ యువతికి ఇంట్లో పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న కరణ్...పెళ్లి తర్వాత కూడా తనతో శారీరక సంబంధాన్ని కొనసాగించాలని మేనకోడలిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీనికి అంగీకరించని ఆ యువతి..మేనమామను దూరంపెట్టింది. అతని నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కి కూడా స్పందించలేదు. ‌ దీంతో ఆమెపై కోపం పెంచుకున్న మేనమామ...ఆమె జీవితాన్ని పాడుకోవాలని నిర్ణయించుకున్నాడు. మేనకోడలితో తాను ఏకాంతంగా గడిపినప్పుడు తీసిన వీడియోలను యువతి తండ్రి ఫోన్ నెంబర్‌కి వాట్సప్‌లో పంపి బ్లాక్ మెయిల్‌కు దిగాడు. ఈ వీడియోలను మేనకోడలి వర్గానికి చెందిన మరికొందరికి కూడా పంపినట్లు తెలుస్తోంది. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Published by: Janardhan V
First published: August 2, 2020, 1:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading