వివాహేతర సంబంధం తెచ్చిన తంటా... కష్టాల్లో బాధిత ఫ్యామిలీ...

కత్తికి రెండు వైపులా పదునున్నట్లుగా... ఫేస్‌బుక్‌తో లాభాలతోపాటూ... నష్టాలూ ఉంటున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఎన్నో నేరాలు చూశాం. ఇది మరొకటి. గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది. పెళ్లైన ఓ మహిళకి... 20 ఏళ్ల కుర్రాడితో ఫేస్‌బుక్‌లో స్నేహం ఏర్పడింది. అది హాయ్ హలో అంటూ మొదలై హద్దులు దాటింది. డైరెక్టుగా కలుసుకున్నారు. శారీరకంగా కూడా ఒక్కటయ్యారు. ఆ తర్వాతేం జరిగింది?

Krishna Kumar N | news18-telugu
Updated: August 29, 2019, 9:33 AM IST
వివాహేతర సంబంధం తెచ్చిన తంటా... కష్టాల్లో బాధిత ఫ్యామిలీ...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Extra Marital Affair : పరిణీత (41)... సౌరాష్ట్రలోని దుంఘల్ ఏరియాలో నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు మైనర్ పిల్లలున్నారు. ఆమె భర్తకు వారాచ్చిలో షాప్ ఉంది. అలా వాళ్ల కాపురం కొనసాగేది. ఐతే... 7 నెలల కిందట... పరిణీత... ఫేస్‌బుక్‌లో 20 ఏళ్ల రాజన్ మను గజేరాకి ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపింది. అతను వారాచ్చిలో ఉంటున్నాడు. ఫలితంగా ఇద్దరి మధ్యా ఫ్రెండ్షిప్ మొదలైంది. అది పెరిగి... విపరీతమైన చాటింగ్‌కి దారితీసింది. అక్కడి నుంచీ ఇద్దరూ డైరెక్టుగా కలుసుకునేదాకా వెళ్లింది. శారీరకంగా ఒక్కటయ్యారు. ఇలా భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధం కొనసాగించింది. ఆ కుర్రాడు కూడా తరచూ ఆమెను కలుస్తూ ఉండేవాడు. ఒక్కోసారి ఆమే అతని దగ్గరకు వెళ్లేది.

ఇలా కొన్నాళ్లు గడిచాక... విషయం భర్తకు తెలిసిపోతుందేమోనన్న భయంతో... ఆమె రాజన్‌ని పక్కకు పెట్టింది. అది తట్టుకోలేకపోయిన రాజన్... ఓ రోజు ఆమె భర్తతో ఉన్నప్పుడే... ఆమె ఇంటికి వెళ్లి... తమ మధ్య వివాహేతర సంబంధం ఉందని చెప్పాడు. పరిణీతకు గుండె పగిలినంత పనైంది. ఐతే... పరిణీత భర్త మంచివాడు కావడంతో... ఇంటి పరువు బజారున పడకూడదన్న ఉద్దేశంతో... రాజన్‌ని సైలెంట్‌గా అక్కడి నుంచీ పంపించేశాడు. ఆ తర్వాత భార్యను మందలించాడు. ఇంకెప్పుడూ అతన్ని కలవవద్దని చెప్పాడు.

కానీ, రాజన్ వదల్లేదు... ఆమెకు అదే పనిగా మెసేజ్‌లు, కాల్స్ చేయసాగాడు. అలా చెయ్యవద్దని చెప్పేందుకు ఓ రోజు... అతని ఇంటికి వెళ్లింది. నచ్చచెప్పాలని చూసింది. కానీ... ఆవేశంతో ఊగిపోయిన రాజన్... "నువ్వు నా రిమోట్ కంట్రోల్‌వి. నేను చెప్పినట్లు వినాల్సిందే. లేదంటే నీ కాపురం కూల్చేస్తాను. నీ చావు, బతుకు నా చేతిలోనే ఉన్నాయి" అంటూ సినిమా డైలాగ్స్ కొట్టాడు. ఎంత చెప్పినా వినని అతనితో వాదించి లాభం లేదనుకున్న పరిణీత అక్కడి నుంచీ వెళ్లిపోయింది.

ఆ తర్వాత పరిణీత భర్త నడుపుతున్న షాపుకి వెళ్లిన రాజన్... అందరికీ తెలిసేలా నానా రభసా చేశాడు. వివాహేతర సంబంధం తప్పు కాదని సుప్రీంకోర్టే చెబితే... దాన్ని అడ్డుకోవడానికి నువ్వెవడివి అంటూ కేకలు పెట్టాడు. ఇలా ఈ వివాహేతర సంబంధం ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఎవరికీ మనస్శాంతి లేకుండా చేస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అడ్డం పెట్టుకొని చాలా మంది ఇలాగే తమ జీవితాలతోపాటూ... ఇతరుల జీవితాలనూ నాశనం చేస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి.
Published by: Krishna Kumar N
First published: August 29, 2019, 9:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading