పాలు కల్తీ చేసినందుకు 6 నెలల జైలు... 24 ఏళ్ల నాటి నేరానికి ఇప్పుడు శిక్ష

Milk Adulteration Case : 1995 నవంబర్‌లో రాజ్ కుమార్ అమ్మిన పాలు... ఆహార కల్తీ నియంత్రణ చట్టంలోని ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని అప్పటి ప్రభుత్వ ఎనలిస్ట్ తేల్చారు.

Krishna Kumar N | news18-telugu
Updated: October 7, 2019, 8:02 AM IST
పాలు కల్తీ చేసినందుకు 6 నెలల జైలు... 24 ఏళ్ల నాటి నేరానికి ఇప్పుడు శిక్ష
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Milk Adulteration Case : మనం కొనే వస్తువుల్లో పాలు ఎక్కువగా కల్తీ అవుతుంటాయి. పాలలో నీళ్లు కలిపేస్తే, ఎవరూ గుర్తించలేరన్న ఉద్దేశంతో కొంతమంది ఇలాంటి తప్పులు చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన పాల వ్యాపారి రాజ్ కుమార్ కూడా ఇలాగే ఆలోచించాడు. పాలలో నీళ్లు కలిపేశాడు. 1995లో జరిగిందీ ఘటన. ఈ పాలపై కొందరు అభ్యంతరం చెప్పారు. కల్తీ పాలు అమ్ముతున్నాడని కేసు పెట్టారు. దీనిపై అప్పటి ప్రభుత్వ ఎనలిస్ట్... పాలను పరీక్షించారు. పాలలో ఫ్యాట్ 4.6 శాతం ఉంది. మిల్క్ సాలిడ్ నాన్ ఫ్యాట్ (MSNF) 7.7 శాతం ఉంది. నిజానికి ఆహార కల్తీ నియంత్రణ చట్టం ప్రకారం అది 8.5 శాతం ఉండాలి. దాంతో రాజ్ కుమార్‌ను ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ తీర్పును సెషన్స్ కోర్టు, హైకోర్టు సమర్థించాయి. చివరకు సుప్రీంకోర్టు కూడా కింది కోర్టుల తీర్పును సమర్థించింది. ఫలితంగా చేసిన నేరానికి 24 ఏళ్ల తర్వాత శిక్ష అమలవుతోంది.

రాజ్ కుమార్ ఏ తప్పూ చెయ్యలేదనీ, పాలను వెంటనే చెక్ చెయ్యకుండా... ఆలస్యంగా పరీక్షించడం వల్ల వాటిలో నాణ్యత పడిపోయిందని ఆయన తరపు లాయర్లు వాదించారు. నాణ్యతలో చిన్నపాటి తేడా ఉంటే... దాన్ని బూతద్దంలో చూడలేమని అన్నారు. గేదెకు పెట్టే ఆహారం, గేదె ఆరోగ్యం వంటి అంశాల్ని కూడా లెక్కలోకి తీసుకోవాలని అన్నారు. ఘటన జరిగి 24 ఏళ్లు అయ్యింది కాబట్టి... విషయాన్ని తేలిగ్గా తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు.

సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం... దోషి తరపు లాయర్ వాదనలన్నింటినీ కొట్టిపారేసింది. ఒక్కసారి చట్ట ప్రకారం ప్రమాణాలు నిర్దేశించాక... ఎవరైనా సరే వాటిని ఫాలో అవ్వాల్సిందే అని స్పష్టం చేసింది. ప్రమాణాల్లో ఏమాత్రం తగ్గినా... స్వల్పంగా తగ్గినా... రాజీ పడే పరిస్థితి ఉండదని తేల్చిచెప్పింది. రాజ్ కుమార్‌కి ఆరు నెలల జైలు శిక్ష అమలు చెయ్యాలని తీర్పు ఇచ్చింది.

 

ఇవి కూడా చదవండి :

Health Tips : కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్... ఇంటి దగ్గరే తయారుచేసుకోండి

Health Tips : స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి 7 సహజ మార్గాలుHealth Tips : డయాబెటిస్ ఉంటే ఖర్జూరాలు తినవచ్చా?
First published: October 7, 2019, 8:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading