Supreme Court: అశ్లీల వీడియోలు చేస్తున్న భార్యతో గొడవ పడ్డ భర్త.. ఆమె కేసు పెట్టడంతో సుప్రీంకోర్టుకు చేరిన వివాదం.. ఏం తీర్పు వచ్చిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

తన భార్య టిక్‌టాక్‌లో 300 వరకు అశ్లీల, అసభ్యకరమైన వీడియోలు చేసిందని రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి కోర్టుకు తెలిపాడు. ఈ విషయంపై గొడవ జరిగిందని, అనంతరం తన భార్య కేసు పెట్టిందని అతడి తరఫు న్యాయవాది వాదించారు. అయితే..

  • Share this:
టిక్‌టాక్‌ వీడియోలు చేసినందుకు భార్యను వేధించిన భర్తకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ నిరాకరించింది. ఇలాంటి వారికి న్యాయస్థానం ఎలాంటి ఉపశమనం కలిగించదని తెలిపింది. భార్యను క్రూరంగా హింసించినందుకు ఒక మహిళ తన భర్తపై పోలీసు కేసు పెట్టింది. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో, ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్త ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. భార్య ప్రవర్తన నచ్చకపోతే, విడాకులు తీసుకొని విడిగా ఉండాలి కానీ.. హింసించడం తగదని ధర్మాసనం తెలిపింది. పిటిషనర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై విచారణను ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డే నేతృత్వంలో, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ముగించింది.

తన భార్య టిక్‌టాక్‌లో 300 వరకు అశ్లీల, అసభ్యకరమైన వీడియోలు చేసిందని రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి కోర్టుకు తెలిపాడు. ఈ విషయంపై గొడవ జరిగిందని, అనంతరం తన భార్య కేసు పెట్టిందని అతడి తరఫు న్యాయవాది వాదించారు. కేసు దర్యాప్తు కోసం పోలీసులు కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టును కోరారు.

నచ్చకపోతే విడిపోవడమే మేలు
ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి భార్య అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతడి భార్య టిక్‌టాక్‌లో 300 వరకు అశ్లీల వీడియోలు చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. అవి అసభ్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. భార్యపై భర్త ఎలాంటి క్రూరమైన హింసకు పాల్పడవద్దని చెప్పింది. ఆమె వీడియోలు చేసినా, తనతో అమర్యాదగా ప్రవర్తి౦చాల్సిన అవసరం లేదని చీఫ్ జస్టిస్ అన్నారు. "మీరు ఆమెతో కలిసి ఉండలేకపోతే విడిపోవచ్చు. అంతేకాని హింసకు పాల్పడుతూ, క్రూరంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు" అని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: పెళ్లి వేడుకలో కలకలం.. భారీగా నగదు ఉన్న బ్యాగ్ మిస్సింగ్.. వీడియో రికార్డు చేస్తున్న కెమెరాను పరిశీలించి కంగుతిన్న బంధువులు

న్యాయవాది, ధర్మాసనం మధ్య సంవాదం
ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి క్రూరమైన వ్యక్తి అని ధర్మాసనం చెప్పింది. ఈ వ్యాఖ్యలను పిటిషనర్ తరఫున వాదిస్తున్న మహిళా న్యాయవాది ఖండిచారు. తన క్లయింట్ ఎలాంటి క్రూరమైన పనులు చేయలేదని ఆమె బదులిచ్చారు. పిటిషనర్ భార్య ఇచ్చిన ఫిర్యాదులో భర్తను క్రూరంగా అభివర్ణించిందని, కోర్టు ఆ విషయం పైనే మాట్లాడుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఈ వ్యవహారంలో కస్టోడియల్ విచారణ అవసరం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. కానీ పిటిషనర్ వాదనతో తాము ఏకీభవించట్లేదని ప్రధాన న్యాయమూర్తి సమాధానమిచ్చారు. తన క్లయింట్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసే అంశాన్ని పరిశీలించాలని లాయర్ కోర్టును కోరారు. కానీ బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నామని ధర్మాసరం తీర్పు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: పెళ్లికి వెళ్లిన భర్త మిస్సింగ్.. కేసు పెట్టిన కొద్ది రోజుల్లోనే భార్య కూడా అదృశ్యం.. ఆ ఇంటి పెరట్లో బయటపడిన బండారం..!
First published: