హోమ్ /వార్తలు /క్రైమ్ /

నిర్భయ దోషులకు షాక్... క్యూరేటివ్ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

నిర్భయ దోషులకు షాక్... క్యూరేటివ్ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిర్భయ దోషులకు ఈనెల 22న ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఇప్పటికే జైలు అధికారులు ఉరికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు.

  నిర్భయ కేసు దోషులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఉరి శిక్ష అమల్లో ఇద్దరు దోషులు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను ధర్మాసనం కోట్టివేసింది 2012లో నిర్భయపై సామూహిక అత్యాచారం చేసి, చంపిన నేరస్థులు ముకేష్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31)లను జనవరి 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరితీయాలని పాటియాల కోర్టు ఆదేశించింది.  దీంతో దోషుల్లో వినయ్, ముఖేష్ చివరి ప్రయత్నంగా సుప్రీంను ఆశ్రయించారు. ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వీరి పిటిషన్‌ను విచారించింది. అనంతరం పిటిషన్‌‌ను కొట్టివేసింది. బెంచ్‌లో ఎన్వీ రమణ, అరుణ్ మిశ్ర, ఆర్ఎఫ్ నారిమన్, ఆర్ భానుమతి, అశోక్ భూషన్ న్యాయమూర్తులుగా ఉన్నారు.

  దీంతో నిర్భయ దోషులకు ఈనెల 22న ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఇప్పటికే జైలు అధికారులు ఉరికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. తలారిని కూడా సిద్ధం చేశారు. బీహార్ బక్సర్ నుంచి ఉరి తాళ్లను కూడా ప్రత్యేకంగా తెప్పించారు. మరోవైపు నిర్భయ తల్లిదండ్రులు సుప్రీం నిర్ణయంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిర్భయ ఆత్మ శాంతిస్తుందని సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: National, Nirbhaya, Supreme Court

  ఉత్తమ కథలు