హోమ్ /వార్తలు /క్రైమ్ /

దిశ నిందితుల మృతదేహాలు.. సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే..

దిశ నిందితుల మృతదేహాలు.. సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే..

సుప్రీంకోర్టు (File)

సుప్రీంకోర్టు (File)

దిశ నిందితుల మృతదేహాలను ఏం చేయాలన్న దానిపై హైకోర్టు ఏం తేల్చుకోలేకపోయింది. తాము ఏ నిర్ణయం తీసుకోవాలని.. సుప్రీం కోర్టును తలుపు తట్టగా దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది.

  దిశ నిందితుల మృతదేహాలు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఉన్నాయి. వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కానీ, దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎవ్వరూ విచారణ చేపట్టవద్దని, తాము ఏర్పాటు చేసిన కమిషన్‌కు మాత్రమే అధికారం ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో మృతదేహాలను ఏం చేయాలన్న దానిపై హైకోర్టు ఏం తేల్చుకోలేకపోయింది. తాము ఏ నిర్ణయం తీసుకోవాలని.. సుప్రీం కోర్టును తలుపు తట్టగా అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మృతదేహాలను ఆస్పత్రిలోనే భద్రపరచాలని స్పష్టత ఇచ్చింది.

  కాగా, సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిషన్‌తో పాటు, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కూడా కొనసాగుతుందని తాజాగా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

  సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు

  సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు

  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  Tags: Disha murder case, Shadnagar encounter, Supreme Court, Telangana News

  ఉత్తమ కథలు