Supreme Court- Bombay High Court: సుప్రీంకోర్టు షాకింగ్ నిర్ణయం.. వివాదాస్పద తీర్పులనిస్తున్న బాంబే హైకోర్టు న్యాయమూర్తి విషయంలో..

సుప్రీంకోర్టు (ఫైల్ ఫొటో)

మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపుల ఘటనలపై బాంబే హైకోర్టు న్యాయమూర్తి ఇస్తున్న తీర్పులు ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీంతో సుప్రీంకోర్టు ఓ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది.

  • Share this:
    స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేదు కదా.. అందువల్ల లైంగిక వేధింపుల కేసుగా పరిగణించలేము.. బాలిక ముందు ప్యాంట్ జిప్ విప్పినంత మాత్రాన లైంగిక వేధింపులు ఎలా అవుతాయి..? అంటూ ఇటీవల బాంబే హైకోర్టులో వివాదాస్పద తీర్పులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తీర్పులను వెల్లడిస్తున్నది ఒకే న్యాయమూర్తి. ఆమె పేరే జస్టిస్ పుష్ప గనేడివాలా. మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపుల ఘటనలపై ఆమె ఇస్తున్న తీర్పులు ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒకదాని తర్వాత మరొకటిగా వచ్చిన ఆమె తీర్పులపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఓ మహిళ అయి ఉండి కూడా ఆమె ఇలాంటి తీర్పులను ఇవ్వడం పట్ల అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఈ తీర్పుల గురించి తెలిసిన సుప్రీంకోర్టు ఓ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం.

    వివాదాస్పద తీర్పులను వెల్లడిస్తున్న జస్టిస్ పుష్ప గనేడివాలా విషయంలో సుప్రీంకోర్టు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమె బాంబే హైకోర్టులోని నాగ్ పూర్ బెంచ్ న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ బెంచ్ కు ఆమెను శాశ్వత న్యాయమూర్తిగా నియమించాలంటూ జనవరి 20న సుప్రీంకోర్టు కొలిజియం కీలక ప్రతిపాదన చేసింది. ఇటీవల ఆమె ఇస్తున్న తీర్పులు వివాదాస్పదం అవుతుండటంతో కొలిజియం ఈ ప్రతిపాదనపై వెనక్కి తగ్గినట్టు సమాచారం. బాంబే హైకోర్టులో ఆమెకు శాశ్వత హోదాను కల్పించేందుకు గతంలో చేసిన సిఫారసును సుప్రీంకోర్టు కొలిజియం వెనక్కు తీసుకున్నట్టు తెలుస్తోంది.

    కాగా ఇటీవల ఓ 12 ఏళ్ల బాలికను ఓ వ్యక్తి తన ఇంట్లోకి తీసుకెళ్లి ఆమె మర్మాంగాలపై అసభ్యకర రీతిలో తడిమాడు. ఆ బాలిక కేకలు వేయడంతో తల్లి వచ్చి ఆమెను రక్షించుకుంది. అతడిపై కేసును పెట్టింది.ఈ కేసులోనే జస్టిస్ పుష్ప గనేడివాలా మొదటగా వివాదాస్పద తీర్పును వెల్లడించారు. బాలిక చర్మానికి, నిందితుడి చర్మం తగలనందున దీన్ని లైంగిక వేధింపుల కింద పరిగణించలేమని తీర్పునిచ్చారు. మరో ఘటనలో ఓ ఐదేళ్ల బాలికను పట్టుకుని, ఆమె ముందే ప్యాంటు జిప్పు విప్పాడో నీచుడు. దీనిపై అదే కోర్టులో కేసు విచారణకు వచ్చింది. దీన్ని కూడా లైంగిక వేధింపుల కిందకు రాదంటూ ఆమె తీర్పునిచ్చింది. ఈ తీర్పులపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడంతో ఆమె విషయంలో గతంలో సుప్రీం కొలిజియం చేసిన సిఫారసులను వెనక్కు తీసుకుంది.
    Published by:Hasaan Kandula
    First published: