Crime News: రూమ్ కి వస్తేనే డ్యూటీ అన్నాడు.. తరువాత ఏం జరిగిందంటే..?

డ్యూటీ కావాలి అంటే రూంకు రావాలన్నాడు

Crime News: ఒక్క ఛాన్స్.. అనే వేధింపులు అన్ని రంగాల్లోనూ పెరిగిపోయాయి. ఆఖరికి రోజూ కూలీలను కూడా కొందరు వదలడం లేదు.. పని కావాలంటే తమ రూమ్ కు రావాలని కండిషన్ పెడుతున్నారు. తాజాగా తిరుపతిలో ఓ కామాంధుడి బాగోతాన్ని ఓ మహిళ బయటపెట్టింది.

 • Share this:
  GT Hemanth Kumar, Tirupati, News18

  Crime News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రోజు రోజుకు మృగాళ్ల సంఖ్య పెరిగింది. నిత్యం చిన్నారుల నుంచి పండు ముసలి వారి వరకు ఏదొక మూలా అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నారు.  స్కూల్స్ కాలేజీల నుంచి విధులు నిర్వహించే కంపెనీల్లో సైతం ఆడవారిపై నిత్యం లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగాల పేరుతో కొందరు మహిళలను వంచనకు గురి చేస్తుంటే.. మరి కొందరు చేస్తున్న ఉద్యోగాల్లో జీతం పెంచాలంటే పక్క పంచుకోవాలి అనేవిధంగా కామంతో దాడి చేస్తున్నారు. ఉద్యోగం చేస్తే గాని పూట గడవని మహిళల పరిస్థితిని క్యాష్ చేసుకుంటున్నారు కొందరు.  డైలీ లేబర్స్ ను సైతం వదలడం లేదు. రూముకి వస్తేనే డ్యూటీ అంటూ లైంగిక దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా (Chitoor District)లో చోటు చేసుకుంది. తిరుపతి (Tirupati) రైల్వే కోచ్ క్లీనింగ్ కార్మికురాలిని లైంగికంగా వేధించిన కామాంధుడుకి మహిళా సంఘాలు బుద్ది చెప్పాయి..

  సూపర్ వైజర్ దొరై తన కోరిక తీరిస్తేనే డ్యూటీలు ఇస్తానని బాదిత మహిళను ప్రలోభాలకు గురి చేశాడు. అయితే ఆమె ఎలాంటి అనుమానం రాకుండా  సూపర్ వైజర్ కోరికను తీర్చుతానని ఒప్పుకున్నట్టు అతడికి చెప్పింది. దీంతో తిరుచానూరులోని లాడ్జిలో రూం తీసుకొని మహిళకు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు దొరై.. అప్పటికే అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని నిర్ణయించిన మహిళా సంఘాల సభ్యులు సైతం ఆమెతో పాటు లాడ్జ్ వద్దకు చేరుకున్నారు.ఆ కామాంధుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహ శుద్ధి చేశారు. 

  ఇదీ చదవండి: పోలీసులకు చిక్కిన అంతర్జాతీయ రెడ్ స్మగ్లర్.. ఎలా చిక్కాడంటే..?

  తరువాత దొరైని  పోలీసులకు పట్టించారు..గత కొద్ది రోజులుగా తన‌ క్రింది స్ధాయి మహిళా ఉద్యోగులతో రైల్వే సూపర్ వైజర్ దొరై అసభ్యకరంగా ప్రవర్తచడమే కాకుండా మానసికంగా వారిని వేధింపులకు గురి చేసి తన కామవాంఛలు తీర్చుకునే వాడని భాధిత మహిళ కన్నీరు మున్నీరు అవుతోంది. అనేక సార్లు సార్లు ఇదే విషయంపై రైల్వే శాఖలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. ఎవరూ పట్టించుకోక పోవడంతో దొరై రెచ్చిపోయే వాడని భాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది..

  ఇదీ చదవండి: ఏపీ అప్పులు 6 లక్షల కోట్లు.. ఇలా అయితే కష్టమే..? జగన్ సర్కార్ పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

  ఉదయం తిరుచానూరు ఆలయంకు కూత వేటు దూరంలోని ఓ లాడ్జ్ లో రూం బుక్ చేశాడు దొరై.. తరువాత ఫోన్ ఛార్జింగ్ పెట్టి అనుభవించు రాజా అనే పాట వింటూ.. మహిళకు పోన్ చేసి తన కోరిక తీర్చాలని భాధిత మహిళని మభ్య పెట్టాడు.. దీంతో ఆ భాధిత మహిళ తోటి మహిళా కార్మికులకు విషయం చెప్పి వారి సహకారంతో మహిళ సంఘాలను కలిసి తన భాధను వెల్లడించింది.. దీంతో భాధిత మహిళకు న్యాయం చేస్తాంమని హామీ ఇచ్చిన మహిళ సంఘాల సభ్యులు.. ఆ లాడ్జ్ కు చేరుకున్నారు.  ముందుగా భాధిత మహిళ రూంలో వెళ్ళగా  తరువాత మహిళా సంఘాలు రూంకి చేరుకుని కామాంధుడుకి దేహశుద్ది చేసాయి.. భాధిత మహిళ ఫిర్యాదుతో తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి‌ దర్యాప్తు చేపట్టారు..
  Published by:Nagesh Paina
  First published: