సన్నీ లియోన్ ఫోన్ నంబర్ దొరకడంతో వెర్రెత్తిన జనం.. అసలు ట్విస్ట్ ఏంటంటే..

Sunny Leone : ఒకేరోజు 400 ఫోన్లు రావడంతో తన బుర్ర బద్దలైపోయిందని వాపోయాడు. ఫోన్‌లే కాదు.. కొంతమంది అసభ్యకరంగా వాట్సాప్‌ మెసేజ్‌లు కూడా చేశారని చెప్పాడు. దీనిపై దర్యాప్తు చేపడుతామని చెప్పిన పోలీసులు నిర్లక్ష్యం చేస్తుండటంతో.. అతను కోర్టుకు వెళ్లేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: July 30, 2019, 3:25 PM IST
సన్నీ లియోన్ ఫోన్ నంబర్ దొరకడంతో వెర్రెత్తిన జనం.. అసలు ట్విస్ట్ ఏంటంటే..
సన్నీ లియోన్
  • Share this:
మొన్నామధ్య బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కేరళకు వెళ్లినప్పుడు.. ఆమెను చూసేందుకు జనం ఎంతలా ఎగబడ్డారో అందరికీ తెలిసిందే. రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోగా.. వారిని అదుపు చేయలేక పోలీసులు సైతం చేతులెత్తేశారు. అదీ సన్నీ లియోన్‌కు జనంలో ఉన్న ఫాలోయింగ్.సన్నీ కనిపిస్తే చాలు వెర్రెత్తిపోయే జనాలు.. ఇక ఆమె ఫోన్ నంబర్ దొరికితే ఊరుకుంటారా..? అదే జరిగింది. సన్నీ పేరుతో ఒక ఫోన్ నంబర్ బయటకు రావడంతో.. వేలమంది ఆమెకు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ నంబర్ ఓ ఉద్యోగిది కావడంతో.. ఆ కాల్స్ రిసీవ్ చేసుకోలేక అతని బుర్ర బద్దలైపోయింది.చివరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఇంతకీ అసలు విషయమేంటంటే.. సన్నీ లియోన్ నటించిన 'అర్జున్ పటియాలా' సినిమా ఇటీవల విడుదలైంది.ఈ సినిమాలో వచ్చే ఓ సన్నివేశంలో సన్నీ పోలీస్ అధికారికి తన తన ఫోన్ నంబర్ ఇస్తుంది. ఇంకేముంది.. ఆ నంబర్ నిజంగా సన్నీదే అని చాలామంది నోట్ చేసేసుకున్నారు. చేసుకోవడమే కాదు.. ఆ నంబర్‌కు ఫోన్ చేసి సన్నీ మేడమేనా మాట్లాడేది? అంటూ ఆరా తీశారు.కాదని బదులిస్తే.. అసభ్యకరంగా తిడుతూ ఫోన్ పెట్టేసేవారు. నిజానికి సన్నీ ఇచ్చిన ఆ ఫోన్ నంబర్ ఆమెది కాదు. ఢిల్లీకి చెందిన పునీత్ అనే ఓ ప్రైవేట్ ఉద్యోగిది.అతని అనుమతి లేకుండా చిత్రయూనిట్ ఆ నంబర్‌ను సినిమాలో వాడుకుంది. దీంతో అది సన్నీ నంబరే అనుకుని చాలామంది పునీత్‌కు ఫోన్ చేయడం మొదలుపెట్టారు.

ఇదేమీ తెలియని పునీత్.. ఉన్నట్టుండి తన ఫోన్ విరామం లేకుండా మోగుతుండటంతో షాక్ తిన్నాడు. ఎందుకిలా ఫోన్లు వస్తున్నాయని గాబరా పడ్డాడు. సన్నీ కోసం తనకు ఫోన్ చేసిన ఓ వ్యక్తిని దీనిపై ఆరా తీయడంతో.. అసలు విషయం చెప్పాడు. అర్జున్ పటియాలా సినిమాలో సన్నీ ఈ నంబర్ చెప్పడంతో ఫోన్ చేస్తున్నట్టు చెప్పాడు. దీంతో ఢిల్లీ పోలీసులకు అతను ఫిర్యాదు చేశాడు. ఒకేరోజు 400 ఫోన్లు రావడంతో తన బుర్ర బద్దలైపోయిందని వాపోయాడు. ఫోన్‌లే కాదు.. కొంతమంది అసభ్యకరంగా  వాట్సాప్‌ మెసేజ్‌లు కూడా చేశారని చెప్పాడు. దీనిపై దర్యాప్తు చేపడుతామని చెప్పిన పోలీసులు నిర్లక్ష్యం చేస్తుండటంతో.. అతను కోర్టుకు వెళ్లేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం.

First published: July 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు