హోమ్ /వార్తలు /క్రైమ్ /

‘సండే హాలీడే’... మతాన్ని అవమానించినందుకు హోటెల్‌కు రూ.150 కోట్ల జరిమానా...

‘సండే హాలీడే’... మతాన్ని అవమానించినందుకు హోటెల్‌కు రూ.150 కోట్ల జరిమానా...

హోటల్ నిర్వాహకులతో మహిళ

హోటల్ నిర్వాహకులతో మహిళ

ఆదివారం సెలవు ఇస్తామని ఒప్పందం చేసుకున్న హోటెల్ యాజమాన్యం... ఆ తర్వాత ఉల్లంఘన... ఆదివారం సెలవు తీసుకున్నందుకు ఉద్యోగం నుంచి తొలగింపు...

వారంలో ఏడు రోజులున్నా... ఆదివారం అంటేనే అందరికీ ఇష్టం. ఆదివారం ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకోవాలని కొందరు ఫిక్స్ అయితే... కుటుంబంతో సరదాగా తిరగాలని మరికొందరు భావిస్తారు. ఇంకొందరు క్రైస్తవులు మాత్రం ఆ రోజు చర్చికి వెళ్లి... దేవుడికి ప్రార్థన చేయాలనుకుంటారు. అయితే ఓ మహిళను, ఆదివారం పనిచేయించినందుకు హోటెల్‌పై 21 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది న్యాయస్థానం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ సంఘటన... సంచలనం క్రియేట్ చేసింది. హైతీకి చెందిన మేరీ జాన్ అనే మహిళ... దక్షిణ ఫ్లోరిడాలో ఉన్న మియామీ నగరానికి వలస వచ్చింది. జీవనోపాధి కోసం ఓ హెటెల్‌లో పనిచేస్తూ వస్తోంది. అయితే స్వతహాగా క్రిస్టియన్ అయిన ఆమె... ఆదివారం చర్చికి వెళ్లడం పక్కా అని ముందే వారికి చెప్పింది. ఆమె మతాభిప్రాయాలను గౌరవించి, పనిలో చేరడానికి ముందే ‘ఆదివారం సెలవు’ ఇస్తామని చెప్పి, ఒప్పందం కూడా రాసుకున్నారు హోటెల్ సిబ్బంది.

అయితే ఆ తర్వాత కిచెన్ మేనేజర్ మాత్రం ఆదివారం కూడా ఆమెను పనికి రావాలని ఇబ్బంది పెట్టడం మొదలెట్టాడు. అయితే చర్చికి వెళ్లాల్సి ఉంటుందని, ఆదివారం రాలేనని తేల్చి చెప్పేసిందామె. తమ మత ఆచారం ప్రకారం ఆదివారం పనిచేయడం తప్పు అని, మతాన్ని అగౌరవపరచడమే అంటూ చర్చి ఫాదర్‌తో లేఖను కూడా రాయించి ఇచ్చింది. అయినప్పటికీ నాస్తికుడైన ఆ కిచెన్ మేనేజర్, ఆమెకు ఆదివారం సెలవు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. దాంతో పదేళ్లపాటు ఆదివారాలు కూడా పనిచేసిందామె. కొన్నిసార్లు తోటి ఉద్యోగుల సాయంతో ఆదివారాలు సెలవు తీసుకుని, చర్చికి వెళ్లింది. ఈ విషయం తెలిసి మేరీ జాన్‌ను ఉద్యోగం నుంచి తొలగించాడు కిచెన్ మేనేజ్. దీంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమ మతనమ్మకాలను అతను అవమానించాడని ఫిర్యాదులో పేర్కొంది. కొన్నాళ్ల పాటు ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన ఫెడరల్ కోర్టు... తాజాగా తీర్పును వెలువరించింది. మేరీ మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా, ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆమెతో ఆదివారం పనిచేయించడం, సరైన కారణం లేకుండా ఉద్యోగం తొలగించినందుకు గానే ఆమెకు 21.5 మిలియన్ డాలర్లు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. దీంతో చేసేది ఆమెకు రూ. 150 కోట్లకు పైగా చెల్లించేందుకు సిద్ధమైంది హోటెల్ యాజమాన్యం.

ఇవి కూడా చదవండి...

గోవాలో దారుణం... 15 ఏళ్ల బాలికపై ఆరు నెలలుగా... ఆమె అత్త ఇంట్లోనే...

‘మానవత్వమా నువ్వెక్కడ’... 17 ఏళ్ల వయసులో తల్లి శవాన్ని సైకిల్‌పై 

16 ఏళ్ల బాలికపై 11 మంది గ్యాంగ్ రేప్ కేసు... ఆ 8 మంది ఎక్కడ...

First published:

Tags: Crime

ఉత్తమ కథలు