‘అందంగా లేనా.. అసలేం బాలేనా’ అంటూ ఆంటీ ఎర.. అనూష ఆంటీ వలలో పడి చివరికి ఇతని పరిస్థితి...

ధనలక్ష్మి అలియాస్ అనూష, సుధాకర్

‘అందంగా లేనా.. అసలేం బాలేనా’ అని అమాయక యువకులకు ఆ ఆంటీ ఎర వేస్తుంది. తనకు తోచిన పేరుతో తనను తాను పరిచయం చేసుకుంటుంది. ఆమె గ్లామర్‌కు పడిపోయి గాలానికి చిక్కారా.. ఇక అంతే సంగతులు. వలలో పడేస్తుంది. అందిన కాడికి దండుకుంటుంది. అది కూడా తెలివిగా. మోసపోయిన ఓ యువకుడు పోలీసులకు మొరపెట్టుకుంటే గానీ ఈ మాయ లేడీ మోసాలు వెలుగులోకి...

 • Share this:
  ఏర్పేడు: ‘అందంగా లేనా.. అసలేం బాలేనా’ అని అమాయక యువకులకు ఆ ఆంటీ ఎర వేస్తుంది. తనకు తోచిన పేరుతో తనను తాను పరిచయం చేసుకుంటుంది. ఆమె గ్లామర్‌కు పడిపోయి గాలానికి చిక్కారా.. ఇక అంతే సంగతులు. వలలో పడేస్తుంది. అందిన కాడికి దండుకుంటుంది. అది కూడా తెలివిగా. మోసపోయిన ఓ యువకుడు పోలీసులకు మొరపెట్టుకుంటే గానీ ఈ మాయ లేడీ మోసాలు వెలుగులోకి రాలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప పట్టణానికి చెందిన దేవరాళ్లు సుధాకర్(38)కు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన ధనలక్ష్మి(35)తో పరిచయం ఏర్పడింది. అయితే.. ఆమె సుధాకర్‌కు తన పేరు అనూషగా చెప్పింది. ఇద్దరి మధ్య ఈ పరిచయం కాస్తా పెరిగి స్నేహంగా మారింది. తనను సుధాకర్ బాగా నమ్ముతున్నాడని ఫిక్స్ అయిన అనూష అతనికి ఓ బంపర్ ఆఫర్ చెప్పి బుట్టలో పడేసింది. తనకు రూ.12 లక్షల విలువ చేసే రూ.500 నోట్లు ఇస్తే.. అందుకు బదులుగా రూ.50 లక్షల విలువ చేసే రూ.100 నోట్లు ఇస్తానని సుధాకర్‌ను నమ్మించింది.

  దీంతో.. అప్పటికే ఆమె మాయలో పడ్డ సుధాకర్ ఆ మాటలను గుడ్డిగా నమ్మి తన ఆస్తిపాస్తులతో పాటు తన వద్దనున్న బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ ఆమెకు రూ.12 లక్షల విలు చేసే రూ.500 నోట్లు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. అయితే.. సుధాకర్‌కు అనూషపై ఎక్కడో చిన్న అనుమానం ఉండటంతో స్నేహితుడిని వెంటబెట్టుకుని మార్చి 15న తిరుపతికి వెళ్లాడు. అక్కడికి వెళ్లి అనూషకు కాల్ చేయగా.. ఏర్పేడు వద్ద వెంకటగిరి రోడ్డులో లెప్రసీ హాస్పిటల్ దగ్గరకు రమ్మని చెప్పింది. సుధాకర్ తన స్నేహితుడితో కలిసి రూ.12 లక్షల డబ్బుతో ఆమె చెప్పిన చోటుకు వెళ్లాడు. రాత్రి 8 గంటలకు అక్కడకు అనూషతో పాటు ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చారు.

  అనూషకు సుధాకర్ తన వద్దనున్న రూ.12 లక్షలు ఇవ్వగా ఆ ఇద్దరు వ్యక్తులు సుధాకర్‌కు రెండు చెక్క బాక్సులను ఇచ్చారు. ఒక్కో బాక్సులో పాతిక లక్షలు ఉన్నాయని నమ్మించారు. సుధాకర్‌ను నమ్మించడం కోసం ఓ బాక్స్ తీసి మరీ వంద నోట్ల కట్టను చూపించారు. దీంతో.. వాళ్ల మాటలను పూర్తిగా నమ్మిన సుధాకర్ వాళ్లు వెళ్లిపోయిన తర్వాత రెండు బాక్సు‌లను తెరిచి చూశాడు. అందులో.. న్యూస్ పేపర్ బండిల్.. దానిపై వంద నోట్లు పేర్చి ఉండటాన్ని చూసి సుధాకర్ కంగు తిన్నాడు. అనూష కోసం వెతికాడు. ఫలితం లేకపోవడంతో ఆమెకు ఫోన్ చేశాడు. కానీ.. ఆమె నుంచి సమాధానం లేకపోవడంతో మోసపోయానని గ్రహించి ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎట్టకేలకు ఏర్పేడు పోలీసులు సూళ్లూరుపేట బస్టాండ్ దగ్గర అనూష ఉన్నట్టు తెలుసుకుని.. ఆమెను అరెస్ట్ చేశారు.

  దయచేసి తిరిగి రండి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాస్‌కు శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పిలుపు

  ఆమె వద్ద ఉన్న రూ.9 లక్షలను స్వాధీనం చేసుకుని తిరుపతి కోర్టుకు తరలించారు. కోర్టు అనూషకు 14 రోజుల రిమాండ్ విధించింది. అధిక డబ్బు వస్తుందనే ఆశతో ఇలాంటి వాళ్ల మాయలో పడితే మొదటికే మోసం వస్తుందని పోలీసులు హెచ్చరించారు. ఈ ధనలక్ష్మి అలియాస్ అనూష గతంలో కూడా ఈ తరహా మోసాలకు పాల్పడింది. అందంగా మాయమాటలు చెప్పి అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువకుడిని కూడా ఇలానే తన బుట్టలో వేసుకుని.. చివరకు డబ్బు తీసుకుని పరారైంది. గతంలో ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి.
  Published by:Sambasiva Reddy
  First published: