సూట్‌కేసులో డెడ్ బాడీ ముక్కలు.. ఒళ్ళు గగుర్పొడిచే దారుణం

ఆ వ్యక్తిని ఎక్కడో చంపేసి.. మృతదేహాన్ని ముక్కలుగా కోశారు. శరీర భాగాలను సూట్ కేసులో పెట్టి సముద్రంలో విసిరేసినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు పోలీసులు.

news18-telugu
Updated: December 3, 2019, 2:56 PM IST
సూట్‌కేసులో డెడ్ బాడీ ముక్కలు.. ఒళ్ళు గగుర్పొడిచే దారుణం
ముంబై బీచ్‌లో సూట్ కేసు
  • Share this:
ముంబైలో తీవ్ర కలకలం రేగింది. మానవ శరీర భాగాలున్న ఓ సూట్‌కేసు‌ బీచ్ ఒడ్డుకు కొట్టుకువచ్చింది. సోమవారం సాయంత్రం మహీమ్ బీచ్‌లోని మఖ్దూం షా బాబా ప్రార్థనాలయం వద్ద ఓ అనుమానాస్పద సూట్‌కేసును స్థానికులు గుర్తించారు. నీటిపై తేలియాడుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని సూట్‌కేసును తెరచిచూస్తే అందులో మానవ శరీర భాగాలు కనిపించాయి. చేతులు, కాళ్లతో పాటు మర్మాంగాలు ఉండడంతో పోలీసులు షాక్ తిన్నారు. అవి ఎవరివి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షల కోసం మృతదేహం భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు.

ఇక మిగతా శరీర భాగాల కోసం అరేబియా సముద్రంలో మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు. స్థానిక మత్స్యకారుల సహాయంతో సముద్రాన్ని జల్లెడ పడుతున్నారు. సూట్ కేసు లభించిన చుట్టు పక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముంబైలో ఇటీవల నమోదైన మిస్సింగ్ కేసును కూడా పరిగణలోకి తీసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తిని ఎక్కడో చంపేసి.. మృతదేహాన్ని ముక్కలుగా కోశారు. శరీర భాగాలను సూట్ కేసులో పెట్టి సముద్రంలో విసిరేసినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు పోలీసులు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.


First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>