Home /News /crime /

SUICIDE PHOTOGRAPHER IN SULTHANAPUR ILLICT AFFAIR WITH WOMEN VB

Telangana: పెద్దపల్లిలో దారుణం.. ఫొటోగ్రాఫర్ ప్రాణం తీసిన అక్రమ సంబంధం.. అసలేం జరిగిందంటే...

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

Peddapalli: ఓ మహిళతో వివాహేతర సంబంధం అతని ప్రాణం తీసింది. తనను వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

    అక్రమ సంబంధాలు అనార్థాలకు దారి తీస్తున్నాయి. పండంటి కాపురాలను దెబ్బ తీస్తున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. అలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో చోటు చేసుకుంది.  ఓ మహిళ వ్యామోహంలో పడిన ఫొటో గ్రాఫర్ బంగారం, డబ్బులు పొగొట్టుకున్నాడు. చివరకు ఆమె వేధింపులు అతని శాపమయ్యాయి. ఆమె పెట్టే ఇబ్బందులను తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  ఎస్సై ఉపేందర్ రావు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..  గోదావరిఖనికి చెందిన కొయ్యడ రమేష్ (33) ఫొటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు.  అతడికి భార్య కీర్తిలావణ్య, కొడుకు, కూతురు ఉన్నారు.  ఏడాది కిందట ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తరచూ ఫోన్‌ చేసుకొని బయట కలుకునేవారు. ఇద్దరు కలిసి ఫొటోలు, వీడియోలు, చాటింగ్‌ చేసుకునేవారు. ఆ మహిళకు అవసరం అయినప్పుల్లా రమేశ్‌ డబ్బులు ఇచ్చేవాడు. అప్పుడప్పుడు బంగారం కూడా బహుమతిగా ఇచ్చాడు. ఇలా దాదాపు రూ.6లక్షల వరకు డబ్బులు, 20 గ్రాముల బంగారం వసూలు చేసింది.

    తిరిగి తన డబ్బులు ఇవ్వమని అడగడంతో..

    తనకు డబ్బులు అవసరం అవ్వడంతో ఒకరోజు ఆమెను తన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగాడు. దానికి ఆమె ససేమీర అనడంతో పాటు బ్లాక్‌మెయిలింగ్‌కు దిగింది. తనతో దిగిన ఫొటోలు, వీడియోలు అందరికీ చూపిస్తానని బెదిరించింది. అంతేకాకుండా తనను ప్రతి నిత్యం  వేధిస్తున్నాడంటూ పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రమేశ్‌ను పోలీస్‌స్టేషకు తీసుకెళ్లి విచారించి వదిలిపెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సదరు మహిళ పెట్టే వేధింపులకు తీవ్ర మానసిక క్షభకు గురవుతున్నానని, ఆత్మహత్య చేసుకుంటున్నానని భార్యకు ఫొన్‌ చేసి జరిగినది అంతా చెప్పి తన మొబైల్ ను  స్విచాఫ్‌ చేశాడు. ఖంగారు పడిన మహిళ వెంటనే చుట్టు పక్కల రమేశ్ ఆచూకీ కోసం వెతికింది. చివరకు తన భర్త కనిపించడం లేదంటూ గోదావరి ఖని వన్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.

    మద్యంలో పురుగు మందు కలుపుకొని..
    సుల్తానాబాద్‌ మండలంలోని నీరుకుళ్ల మానేరు వాగు వద్ద మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రమేశ్‌ మృతదేహంగా గుర్తించారు. పక్కనే మద్యం సీసాలు, పరుగుల మందు ఉండటంతో మద్యంలో పురుగు మందు కలుపుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Crime, Crime news, Godavarikhani, Peddapalli, Photographer, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు