రెండేళ్లు సహజీవనం.. ఆ తర్వాత ఎంత పనిచేశారంటే..

యువత ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోలేక చిన్న చిన్న కారణాలకే విడిపోవడం.. ప్రాణాలను తీసుకోవడం పరిపాటిగా మారింది. ఓ యువకుడు తనతో సహజీవనం చేసిన యువతి వదిలివెళ్లిపోయిందంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

news18-telugu
Updated: April 8, 2020, 1:19 PM IST
రెండేళ్లు సహజీవనం.. ఆ తర్వాత ఎంత పనిచేశారంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రస్తుత రోజుల్లో సహజీవనం సర్వసాధారణం అయిపోయింది. ఈ తరహా ధోరణి ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువగా కన్పిస్తోంది. ఈ క్రమంలో యువత ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోలేక చిన్న చిన్న కారణాలకే విడిపోవడం.. ప్రాణాలను తీసుకోవడం పరిపాటిగా మారింది. అలాంటిదే ఈ ఘటన కూడా. ఓ యువకుడు తనతో సహజీవనం చేసిన యువతి వదిలివెళ్లిపోయిందంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో చంద్రకిరణ్(32) సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ యువతితో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అప్పటివరకు బేగంపేటలో నివాసముంటున్న వారు ఇటీవల కేపీహెచ్‌బీ తులసినగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లోకి మారారు.

అయితే సహజీవనం చేస్తున్న యువతి 25 రోజుల క్రితం చంద్రకిరణ్‌ను వదిలివెళ్లిపోయింది. దీంతో చంద్రకిరణ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. సదరు యువకుడి సోదరుడు రాకేష్ మంగళవారం కాల్ చేశాడు. చంద్రకిరణ్ ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రాకేశ్ అనుమానం వచ్చి రూమ్‌కి వచ్చాడు. అప్పటికే చంద్రకిరణ్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలంలో సహజీవనం చేసిన అమ్మాయి లేనిదే నేను బతకలేనని రాసిన లేఖ అక్కడ దొరికినట్టు పోలీసులు చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Narsimha Badhini
First published: April 8, 2020, 1:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading