పండగపూట విషాదం.. పెళ్లికి పెద్దలు అంగీకరించరనే భయంతో ప్రేమజంట ఆత్మహత్య

ఆసిఫాబాద్ జిల్లాలో పండుగపూట విషాదం నెలకొంది. పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోరనే ఉద్దేశంతో అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

news18-telugu
Updated: March 25, 2020, 7:38 PM IST
పండగపూట విషాదం.. పెళ్లికి పెద్దలు అంగీకరించరనే భయంతో ప్రేమజంట ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పండగపూట విషాదం నెలకొంది. ఓ ప్రేమ జంట తమ ప్రేమకు పెద్దలు అంగీకరించరనే ఉద్దేశంతో అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆసిఫాబాద్ జిల్లాలోని కొత్త సార్సాలా గ్రామానికి చెందిన శైలజ, బిబ్రా గ్రామానికి చెందిన దుర్గం సంతోష్‌లు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకొరని ఆందోళన చెంది కాగజ్ నగర్ మండలం అంకుశాపూర్ అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. కాగా మధ్యాహ్నాం అటుగా పశువులను మేపేందుకు వెళ్లిన స్థానిక వ్యక్తులకు చెట్టుకు వేలాడుతూ ప్రేమజంట కన్పించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్గం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు