ప్రేమకు పెద్దలు అంగీకరించలేదని.. రైలు పట్టాలపై ప్రేమ జంట..

తమ ప్రేమకు పెద్దలు అంగీకరించడం లేదని ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. రైలు పట్టాలపై పడుకుని సెల్ఫీ తీసుకున్నారు. చెన్నై ఎక్స్‌ప్రెస్ అతివేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు.

news18-telugu
Updated: March 21, 2020, 12:43 PM IST
ప్రేమకు పెద్దలు అంగీకరించలేదని.. రైలు పట్టాలపై ప్రేమ జంట..
రైలు పట్టాలు (ఫైల్ ఫొటో)
  • Share this:
ఓ ప్రేమ జంట తమ ప్రేమకు పెద్దలు అంగీకరించడంలేదని రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తిరుపత్తూరు జిల్లా ఆలంగాయంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుడియాత్తం సామర్షికుప్పం గ్రామానికి చెందిన కోదండన్ కొడుకు రామదాస్(29), ఆలంగాయం సమీపంలోని పూంగాపుదూరు గ్రామానికి చెందిన ఉమాపతి కుతూరు నందిని(22) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా రామదాస్ హోసూరులోని ఓ వెల్డింగ్ షాపులో పనిచేస్తున్నాడు. అయితే వీరిద్దరి ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు. దీంతో ప్రేమికులిద్దరూ గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చి ఆంబూరు సమీపంలోని పచ్చకుప్పం రైల్వే పట్టాల వద్దకు వచ్చారు.

రైలు పట్టాల పక్కనే కూర్చొని కొద్దిసేపు ప్రేమికులిద్దరూ మాట్లాడుకున్నారు. మన ప్రేమను పెద్దలు ఒప్పుకోవడం లేదని, కలిసి ఉండడం కష్టమని, ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే చెన్నై-బెంగళూరు వెళ్లే రైలు పట్టాలపై పడుకొని సెల్ఫీ తీసుకున్నారు. చెన్నై నుంచి వచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలు అతివేగంగా పట్టాలపై పడుకున్న ఈ ప్రేమ జంటను ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రేమికులిద్దరూ అక్కడికక్కడే మరణించారు. శుక్రవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు జోలార్‌పేట రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Narsimha Badhini
First published: March 21, 2020, 12:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading