Coronavirus:మాచర్లలో విషాదం.. కరోనా సోకిందన్న అనుమానంతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో తాపీమేస్త్రీగా పనిచేసే వ్యక్తి లాక్‌డౌన్ కారణంగా రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. కాగా శనివారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

news18-telugu
Updated: March 28, 2020, 12:42 PM IST
Coronavirus:మాచర్లలో విషాదం.. కరోనా సోకిందన్న అనుమానంతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మాచర్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తనకు కరోనా వైరస్ సోకిందేమోనన్న భయంతో శనివారం వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన అక్కల వెంకటయ్య(55) హైదరాబాద్‌లో తాపీ మేస్త్రీగా పనిచేసేవాడు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రెండు రోజుల క్రితమే స్వగ్రామానికి చేరుకున్నాడు. గ్రామానికి వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడమే కాకుండా ఇతరులతోనూ ముభావంగా ఉంటున్నాడు.

శుక్రవారం గ్రామంలో హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు తమ పేర్లను నమోదు వేయించుకోవాలని దండోరా వేయించారు. వెంకటయ్య సైతం తన పేరును నమోదు చేసుకున్నాడు. అనంతరం వెంకటయ్య శనివారం గ్రామ శివారుకు వెళ్లి రెండో కొడుకు శిలువబాబుకు ఫోన్ చేసి తనకు కరోనా వైరస్ సోకిందనే అనుమానం ఉందని, తన వల్ల ఊరందరికీ వస్తుందని, గ్రామ శివారులో ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడు.

వెంకటయ్య కొడుకు శిలువబాబు అక్కడికి చేరుకునే సరికి ద్వారకపూడి రహదారి పక్కన వేపచెట్టుకు ఉరేసుకుని కన్పించాడు. వెంటనే శిలువబాబు పోలీసులు సమాచారం ఇవ్వగా, పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
First published: March 28, 2020, 12:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading