HOME »NEWS »CRIME »suicide bomb attack in iraq capital baghdad 28 people died ms

Baghdad Blasts: భగ్గుమన్న బాగ్దాద్.. ఆత్మాహుతి దాడులలో 28 మంది మృతి..

Baghdad Blasts: భగ్గుమన్న బాగ్దాద్.. ఆత్మాహుతి దాడులలో 28 మంది మృతి..
బాంబులు పేలిన ప్రాంతం

Suicide Bombs Rocks In Baghdad: ముందుగా అక్కడకు వచ్చిన ఒక ఉగ్రవాది.. అస్వస్థతకు గురైనట్టు నటించాడు. అది చూసి పలువురు జనాలు అక్కడ గుమిగూడారు. దీంతో అతడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు

  • News18
  • Last Updated: January 21, 2021, 18:22 IST
  • Share this:
    ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి రక్తసిక్తమైంది. గురువారం ఉదయం రెండు ఆత్మాహుతి దాడులు జరగడంతో బాగ్దాద్ ఒక్కసారిగా ఉలికిపడింది. బాగ్దాద్ లో నిత్యం రద్దీగా ఉండే బాబ్ అల్ షార్కీ ప్రాంతంలో ఈ దాడులు జరిగినట్టు తెలుస్తున్నది. ఈ ఘటనలో ఇప్పటివరకు 28 మంది ప్రాణాలు కోల్పోగా.. 70 మందికి పైగా గాయపడ్డట్టు తెలుస్తున్నది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశమున్నట్టు సమాచారం. ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్దాద్ లో నిత్యం జనాలతో కిటకిటలాడే బాబ్ అల్ షార్కీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముందుగా అక్కడకు వచ్చిన ఒక ఉగ్రవాది.. అస్వస్థతకు గురైనట్టు నటించాడు. అది చూసి పలువురు జనాలు అక్కడ గుమిగూడారు. దీంతో అతడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు.

    ఇదిలాఉండగా.. ఘటనాస్థలికి చేరుకున్న పలువురు సహాయక సిబ్బంది, పోలీసులు, సాధారణ ప్రజలు ఆ దారుణాన్ని చూస్తుండగానే.. మరో దుండగుడు ఆత్మాహుతి చేసుకున్నాడు. వరుసగా జంట పేలుళ్లతో ఆ ప్రాంతమంతా శవాలతో రక్తసిక్తమైంది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.







    అయితే ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ దాడులు తమ పనే అని ప్రకటించలేదు. ఇరాక్ ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ లో ముందస్తు ఎన్నికలు వెళ్లనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఈ దాడులు జరగడం గమనార్హం.
    Published by:Srinivas Munigala
    First published:January 21, 2021, 18:19 IST