రాత్రి ఆలస్యంగా వచ్చాడని మందలిస్తే.. ఐ మిస్ యూ అని మెసేజ్ పెట్టి..

తన స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తూ రాత్రివేళ ఇంటికి వస్తున్నాడు. దీంతో ఇంటికి ఆలస్యంగా ఎందుకు వస్తున్నావంటూ తల్లిదండ్రులు మందలించారు.

news18-telugu
Updated: July 16, 2020, 12:57 PM IST
రాత్రి ఆలస్యంగా వచ్చాడని మందలిస్తే.. ఐ మిస్ యూ అని మెసేజ్ పెట్టి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అతడు బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి. స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తూ రాత్రివేళ ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. దీంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువకుడు రాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చి తన స్నేహితుడికి ఐ మిస్ యూ అని మెసేజ్ పెట్టాడు. సమీపంలోని ఓ కాలువ వద్ద బైక్ నిలిపి.. అందులో తన మొబైల్‌ను స్విచ్చాఫ్ చేసి పెట్టాడు. దీంతో పోలీసులు ఆ కాల్వలో యువకుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లికి చెందిన పలగాని రమేశ్ అనే యువకుడు విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. అయితే తరచూ తన స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తూ రాత్రివేళ ఇంటికి వస్తున్నాడు. దీంతో ఇంటికి ఆలస్యంగా ఎందుకు వస్తున్నావంటూ తల్లిదండ్రులు మందలించారు.

దీంతో మనస్తాపం చెందిన రమేశ్ రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. తన స్నేహితుడికి ఐ మిస్ యూ అంటూ మెసేజ్ పెట్టాడు. వెంటనే అనుమానం వచ్చిన స్నేహితుడు.. రమేశ్ తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. వెంటనే తల్లిదండ్రులు కొడుకు రమేశ్ కోసం గన్నవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు రమేశ్ కోసం గాలించే క్రమంలో కేసరపల్లి కాల్వ వద్ద రమేశ్ బైకును గుర్తించారు. తన మొబైల్‌ను స్విఛాఫ్ చేసి బైకులో పెట్టాడు. దీంతో రమేశ్ కాల్వలోకి దూకి ఉంటాడేమోనని పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Published by: Narsimha Badhini
First published: July 16, 2020, 12:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading