Home /News /crime /

SUDDEN TWIST IN THE MYSTERIOUS DEATH OF HER HUSBAND IN ARUMBAKKAM SSR

OMG: ఎట్టకేలకు బయటపడింది.. ఈ భార్య తెలివితేటల గురించి చెప్పడం కాదు.. చూడండి..

ధనలక్ష్మి, అనంతకుమార్ (ఫైల్ ఫొటో)

ధనలక్ష్మి, అనంతకుమార్ (ఫైల్ ఫొటో)

భార్యాభర్తల మధ్య గొడవలు ముదిరితే జరిగే నష్టం అంతాఇంతా కాదు. ఆ సంసార బంధానికే బీటలు వారే ప్రమాదం ఉంది. భర్త ప్రవర్తన కారణంగానో, భార్యపై అనుమానం కారణంగానో.. భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరు క్షణిక సుఖాల మోజులో పడటం మూలానో ఎన్నో కాపురాలు చితికిపోతున్నాయి.

ఇంకా చదవండి ...
  చెన్నై: భార్యాభర్తల మధ్య గొడవలు ముదిరితే జరిగే నష్టం అంతాఇంతా కాదు. ఆ సంసార బంధానికే బీటలు వారే ప్రమాదం ఉంది. భర్త ప్రవర్తన కారణంగానో, భార్యపై అనుమానం కారణంగానో.. భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరు క్షణిక సుఖాల మోజులో పడటం మూలానో ఎన్నో కాపురాలు చితికిపోతున్నాయి. వీటితో పాటు మద్యం కూడా పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతోంది. తాగుడుకు బానిసైన భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకోవడమో లేక అతనినే హత్య చేయడమో లాంటి ఘటనలు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. తాజాగా చెన్నైలోని అరుంబక్కంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తాగుబోతు భర్తను ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన భార్య ఆ హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించింది. అయితే.. పోలీసులు ఆమే భర్తను హత్య చేసినట్లు తేల్చారు.

  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరుంబక్కంలోని డాక్టర్.రాధాకృష్ణన్ నగర్‌కు చెందిన ధనలక్ష్మి, అనంతకుమార్(40) భార్యాభర్తలు. ఇటీవల ఆమె చేతికి గాయంతో హాస్పిటల్‌లో అర్ధరాత్రి సమయంలో చేరింది. తన భర్త తాగొచ్చి వేధిస్తున్నాడని, కత్తితో గాయపరిచాడని చెప్పడంతో డాక్టర్లు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ధనలక్ష్మి ఫిర్యాదుతో మరుసటి రోజు ఉదయం ఆమె ఇంటికి వెళ్లారు. ఇంటికి బయట వైపు తాళం వేసి ఉంది. పోలీసులకు అనుమానం వచ్చి తాళం బద్ధలు కొట్టి చూడగా.. ఇంటి లోపల ధనలక్ష్మి భర్త ఉరికి వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు.

  ఇది కూడా చదవండి: Bus Conductor: నీలాంటి బస్ కండక్టర్‌ను జీవితంలో చూడలా.. ఛీఛీ.. అయినా నువ్వెలా ఒప్పుకున్నావమ్మా..

  అయితే.. అతని తలకు, మెడకు గాయం అయినట్లు కనిపించడంతో పోలీసులకు ఆత్మహత్య కాదేమోనన్న అనుమానం వచ్చింది. పోలీసులు అనంతకుమార్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అరుంబక్కం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇంటి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. కొందరు వ్యక్తులు అనంతకుమార్ ఇంట్లోకి వెళ్లడాన్ని గమనించారు. ఈ కేసు విచారణ కొనసాగించిన పోలీసులకు సడన్ ట్విస్ట్ ఎదురైంది.

  ఇది కూడా చదవండి: Sister: వచ్చిన పెళ్లి సంబంధాలను పిన్ని కూతురు రిజెక్ట్ చేస్తోందని ఏ తమ్ముడైనా ఇలా చేస్తాడా..

  అనంతకుమార్‌ ఆత్మహత్య చేసుకోలేదని.. అతని భార్య ధనలక్ష్మి అతనిని చంపి ఉరికి వేలాడిదీసి ఆత్మహత్యగా చిత్రీకరించిందని తేలింది. తనపై అనుమానం రాకుండా గాయాలతో ఆస్పత్రిలో చేరి.. భార్యతో గొడవల కారణంగా మనస్తాపంతో అనంతకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించింది. కానీ.. ధనలక్ష్మి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. అయితే.. హత్య జరిగిన రోజు అనంతకుమార్, ధనలక్ష్మి ఇంట్లో ఉండగా ఇంట్లోకి వెళ్లిన వ్యక్తులు ఎవరనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మద్యానికి బానిసైన తన భర్త నిత్యం అనుమానంతో వేధిస్తున్నాడని, రోజూలానే ఆ రోజు కూడా తాగొచ్చి గొడవపడటం వల్ల క్షణికావేశంలో అతనిని కొట్టి చంపినట్లు ధనలక్ష్మి అంగీకరించింది. కేబుల్ టీవీ కేబుల్‌తో ఉరేసుకున్నట్టుగా సీన్ క్రియేట్ చేసి ధనలక్ష్మి గాయాలతో వెళ్లి ఆస్పత్రిలో చేరినట్లు పోలీసుల విచారణలో తేలింది.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Chennai, Crime news, Husband, Wife

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు