Agra: ఆగ్రాలో ఓ ఎస్‌ఐకి ఊహించని రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు.. యూపీలో విషాద ఘటన..!

ఎస్‌ఐ ప్రశాంత్ యాదవ్(ఫైల్ ఫొటో)

ఆగ్రాలో ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఆ ఎస్ఐ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆగ్రా జిల్లాలోని ఖండోలి ప్రాంతానికి చెందిన శివ్‌నాథ్, విశ్వనాథ్ అనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య గత కొంత కాలంగా...

  • Share this:
    యూపీ: ఆగ్రాలో ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఆ ఎస్ఐ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆగ్రా జిల్లాలోని ఖండోలి ప్రాంతానికి చెందిన శివ్‌నాథ్, విశ్వనాథ్ అనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య గత కొంత కాలంగా ఆస్తి పంపకాల విషయంలో వివాదం నడుస్తోంది. ఇద్దరు అన్నదమ్ములు పంపకాలు చేసుకున్న భూముల్లో బంగాళదుంప పంట చేతికొచ్చింది.

    తన భూముల్లోని బంగాళదుంపలను కూడా తనకు దక్కనీయకుండా తన సోదరుడు బెదిరిస్తున్నాడని శివనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన మనుషులను ఇంటికి పంపి బంగాళదుంపలపై చేయి వేస్తే చంపుతామని బెదిరించాడని విశ్వనాథ్‌పై శివ్‌నాథ్ ఫిర్యాదు చేశాడు. తన తమ్ముడు విశ్వనాథ్ చంపుతానని బెదిరించాడన్న శివ్‌నాథ్ ఫిర్యాదుతో ఎస్‌ఐ ప్రశాంత్ యాదవ్ విశ్వనాథ్‌ను విచారించి.. అన్నదమ్ముల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పొలం వద్దకు వెళ్లాడు.

    ఎస్‌ఐ ప్రశాంత్ యాదవ్ అక్కడికి రావడాన్ని గమనించిన విశ్వనాథ్ తన వద్దనున్న నాటు తుపాకీతో ఎస్‌ఐపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో బుల్లెట్ ఎస్‌ఐ ప్రశాంత్ యాదవ్ మెడకు తగలడంతో ఎస్‌ఐ కుప్పకూలాడు. కొన ప్రాణంతో కొట్టుమిట్టాడిన సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ యాదవ్ కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. ఎస్‌ఐపై కాల్పులు జరిపిన అనంతరం.. విశ్వనాథ్ భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఎస్‌ఐపై కాల్పులు జరిగిన విషయం తెలుసుకున్న ఆగ్రాలోని పలు పోలీస్ స్టేషన్లలోని పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

    ఉన్నతాధికారులు సైతం అక్కడికి చేరుకుని క్యాంపింగ్ ఏర్పాటు చేసుకుని సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. చనిపోయిన ఎస్‌ఐ ప్రశాంత్ కుమార్ యాదవ్ యూపీ ప్రావిన్సియల్ పోలీస్ సర్వీస్‌ 2015 బ్యాచ్‌కు చెందిన వ్యక్తి అని ఆగ్రా ఎస్‌ఎస్‌పి బబ్లుూ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. చనిపోయిన పోలీసు కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా కింద రూ.50 లక్షలు, ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని యోగి సర్కార్ హామీ ఇచ్చింది. ప్రశాంత్ యాదవ్ గ్రామంలోని ఓ రోడ్డుకు అతని పేరు పెడతామని ప్రకటించింది.

    చిన్నారి కిడ్నాప్‌కు యత్నించిన మహిళ.. అరెస్ట్ చేసిన పోలీసులు


    మరిన్ని వీడియోలు చూడటం కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ చానెల్ సబ్ స్క్రయిబ్ చేసుకోండి..
    Published by:Sambasiva Reddy
    First published: