యూపీలో మళ్లీ రెచ్చిపోయిన రౌడీలు.. పోలీసులపై కాల్పులు

ఎదురు కాల్పుల్లో ఓ క్రిమినల్‌కు గాయాలయ్యాయని.. అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని బదాయూం ఎస్ఎస్‌పీ అశోక్ కుమార్ త్రిపాఠి తెలిపారు.

news18-telugu
Updated: July 15, 2020, 8:26 AM IST
యూపీలో మళ్లీ రెచ్చిపోయిన రౌడీలు.. పోలీసులపై కాల్పులు
యూపీలో మళ్లీ రెచ్చిపోయిన రౌడీలు.. పోలీసులపై కాల్పులు
  • Share this:
యూపీలో రౌడీ మూకలు రెచ్చిపోతూనే ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే, అతడి అనుచరులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినా గూండాల్లో మార్పు రావడం లేదు. పోలీసులపైనే దాడులు చేస్తూ చెలరేగిపోతున్నారు. తాజాగా బదాయూంలో పోలీసులే లక్ష్యంగా రౌడీ మూకలు కాల్పులు జరిపారు. కరావ్ బైపాస్ వద్ద సాధారణ తనిఖీలు చేస్తున్న క్రమంలో పోలీసులపై దాడి చేశారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో ఓ ఎస్ఐకి గాయాలయ్యాయి. ఎదురు కాల్పుల్లో ఓ క్రిమినల్‌కు గాయాలయ్యాయని.. అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని బదాయూం ఎస్ఎస్‌పీ అశోక్ కుమార్ త్రిపాఠి తెలిపారు.

జూలై 3న కాన్పూర్ సమీపంలోని చౌబేపూర్ పోలీస్ స్టేషన్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసులు చనిపోయారు. వీరిలో డీఎస్పీతో పాటు ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే, అతడి అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వికాస్ గ్యాంగ్‌‌లోని ముగ్గురు కీలక వ్యక్తులను పోలీసులు మట్టుబెట్టారు. ఆ తర్వాత జులై 9న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్ ఆలయంలో వికాస్ దుబేను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి కాన్పూర్‌కు తీసుకెళ్తున్న క్రమంలో వికాస్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కొని కాల్పులు జరిపారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో వికాస్ దుబే చనిపోయాడు.
Published by: Shiva Kumar Addula
First published: July 15, 2020, 8:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading