బాసర రైల్వే స్టేషన్‌లో ప్రమాదం... రైలు నుంచి దూకిన విద్యార్థులు

తాము ఎక్కాల్సిన రైలు కాకుండా మరో రైలు ఎక్కామని గుర్తించిన ముగ్గురు విద్యార్థులు... కదులుతున్న రైలు నుంచి కిందకు దూకిన ఘటన అదిలాబాద్ జిల్లా బాసర రైల్వేస్టేషన్‌లో జరిగింది.

news18-telugu
Updated: November 17, 2019, 11:41 AM IST
బాసర రైల్వే స్టేషన్‌లో ప్రమాదం... రైలు నుంచి దూకిన విద్యార్థులు
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తాము ఎక్కాల్సిన రైలు కాకుండా మరో రైలు ఎక్కామని గుర్తించిన ముగ్గురు విద్యార్థులు... కదులుతున్న రైలు నుంచి కిందకు దూకిన ఘటన అదిలాబాద్ జిల్లా బాసర రైల్వేస్టేషన్‌లో జరిగింది. ఓ పరీక్ష కోసం నిజామాబాద్‌ వెళ్లేందుకు బాసర ట్రిపుల్‌ ఐటీ నుంచి 106 మంది విద్యార్థులు బయల్దేరారు. అయితే వీరిలో ముగ్గురు అజంతా ఎక్స్‌ప్రెస్‌ ఎక్కబోయి పొరపాటున పర్భని పాసింజర్‌ రైలు ఎక్కారు. విషయం గుర్తించి వెంటనే రైలు దిగేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే రైలు ముందుకు కదలడంతో...అందులో నుంచి కిందకు దూకేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు.

వీరిలో ఓ విద్యార్థికి తలపై బలమైన గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి వరంగల్‌ జిల్లాకు చెందిన సాయికుమార్‌గా అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఘటనపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.





First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com