STUDENT URINATES ON BOOKS AND LAPTOP OF BLACK STUDENT IN RACIST ATTACK IN SOUTH AFRICAN UNIVERSITY PAH
Shocking: క్యాంపస్ లో దారుణం.. విద్యార్థి పుస్తకాలు, ల్యాప్ టాప్ పై మూత్ర విసర్జన... వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..
గదిలొో మూత్ర విసర్జన చేస్తున్న విద్యార్థి
South africa: సీనియర్ స్టూడ్ంట్ రూమ్ కి వచ్చాడు. వచ్చి రాగానే.. జూనియర్ యువకులతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత.. గదిలో ల్యాప్ టాప్ పై మూత్ర విసర్జన చేసి నీచంగా ప్రవర్తించాడు.
మరోసారి జాత్యంహకార ఘటన వార్తలలో నిలిచింది. ఇప్పటికే అమెరికాలో తరచుగా జాత్యంహరం వలన అక్కడి వారు నల్లజాతీయులపై కాల్పులకు తెగబడుతుంటారు. తమ దేశం వదిలి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు పాల్పడిన ఘటనలు తరచుగా వెలుగులోనికి వస్తుంటాయి. గత వారమే.. అమెరికాలో ఒక యువకుడు కాల్పులకు తెగబడ్డ ఘటనలో పదిమందికి పైగా చనిపోయారు. నల్లజాతీవారు ఉన్నసూపర్ మార్కెట్ టార్గెట్ గా చేసుకొని అతను కాల్పులకు పాల్పడ్డాడు. కొన్ని యూనివర్సిటీలో అప్పుడుడప్పుడు జాత్యంహంకర ఘటనలు జరుగుతుంటాయి. వేరే దేశానికి చెందిన విద్యార్థులను టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడుతుంటారు. అదే విధంగా, వారిపై భౌతిక దాడులకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటన మరోసారి వార్తలలో నిలిచింది.
A white student urinates all over a black first year students room, claims this what 'they' do to black boys. I cannot keep quiet about this, justice need to be served. I urge you to play your part so this cannot be covered up pic.twitter.com/kbPVZuP6YT
పూర్తి వివరాలు.. సౌత్ ఆఫ్రికా యూనివర్సిటీలో (South africa) అత్యంత దారుణమైన ఘటన జరిగింది. జాత్యంహంకారంతో విద్యార్థులు, నల్లజాతీయులపై (Rasis) అత్యంత నీచంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సౌత్ ఆఫ్రికాలో ఒక శ్వేత జాతీ విద్యార్థి, నల్ల జాతీ విద్యార్థి గదిలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత... వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో గదిలోనే విద్యార్థి పుస్తకాలు,ల్యాప్ టాప్ పై మూత్ర విసర్జన (student urinating on laptop) కూడా చేశారు.
నా గదిలోని ఎందుకు మూత్ర విసర్జన చేస్తున్నారంటే ఏమి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. కాగా, 25 ఏళ్ల థియున్స్ అనే యువకుడు ఈ నీచానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా, దీన్ని 20 ఏళ్ల బబలో ద్వయనా దీన్ని రికార్డు చేశాడు. ఘటన జరిగినప్పుడు అతను, సీనియర్ తో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత.. భయపడిపోయి ఊరుకున్నాడు. ఘటన తర్వాత.. యూనివర్సీటి యాజమాన్యం ఘనపై సీరియస్ అయ్యింది.
ఈ ఘటనకు ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. సదరు విద్యార్థిని సస్పెండ్ చేస్తున్నట్లు యూనివర్సీటి అధికారులు తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాడానికి ప్రత్యేక అధికారులను నియమించింది. కాగా, ఈ ఘటనపై క్యాంపస్ లో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విమ్ డి విలియర్స్తో మాట్లాడుతూ.. ఈ రకమైన ప్రవర్తనకు తాము వ్యతిరేకమని, ఇలాంటి పనులకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూనివర్శిటీలో ఇలాంటి ప్రవర్తన సహించబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం అధికారులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.