లైంగిక వేధింపులు(Sexual Harassments).. చిన్నారుల జీవితాలను ఛిదిమేస్తున్నాయి.. దేశంలో ఏదో ఓ చోట లైగింగ వేధింపులకు బాలికలు బలి అవుతున్నారు. తాజాగా లైంగిక వేధంపులు భరించలేక ఓ పాఠశాల విద్యార్థిని చెన్నైలో ఆత్మహత్య చేసుకుంది. "తల్లి కడుపులో లేదా సమాధిలో మాత్రమే ఆడపిల్ల సురక్షితంగా ఉంది" అని సూసైడ్ నోట్ రాసి ఆ పాఠశాల విద్యార్థిని శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ కేసులో మూడు రోజుల తర్వాత, 21 ఏళ్ల కళాశాల విద్యార్థి లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్యాడు. డిసెంబర్ 18, 2021న బాలిక తల్లి మార్కెట్ నుంచి తిరిగి వచ్చే సరికి ఉరి వేసుకొని మృతి చెందింది. ఈ కేసులు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మూడు రోజుల్లో ఒకరిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వ్యక్తి బాలికను వేధింపులకు గురి చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. యువకుడిపై లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు.
కదిలించిన సూసైడ్ నోట్..
ఆ బాలికి సూసైడ్ నోట్ అందరినీ కదిలించింది. పాఠశాల సురక్షితంగా లేదని, ఉపాధ్యాయులను విశ్వసించకూడదని ఆమె నోట్‌లో పేర్కొంది. కలలో కూడా మానసిక హింసకు గురికావడం వల్ల తనకు చదువు, నిద్ర కూడా పట్టడం లేదని రాసింది. ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలకు మర్యాదగా ఉండడం నేర్పాలని ఆమె నోట్‌లో రాసింది.
సూసైడ్ నోట్ ఆధారంగా..
సూసైడ్ నోట్ (Suicide Note) ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. మూడేళ్ల క్రితం బాలిక 8వ తరగతి చదువుతుండగా, అబ్బాయి అదే పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నాడు. ఆమె తర్వాత బాలికల పాఠశాలకు వెళ్లింది, అయితే ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహితులయ్యారు. “మైనర్ బాలికతో శారీరక సంబంధం ఉందని అబ్బాయి ఒప్పుకున్నాడు. గత రెండు వారాలుగా ఆమెను వేధిస్తున్నాడు.
Monkeys Revenge: కుక్కలపై కోతుల ప్రతీకారం.. మహారాష్ట్రలో 250 కుక్కలను చంపిన కోతులు!
చిత్రహింసలకు గురిచేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. మెసేజ్‌లు, ఫొటోగ్రాఫ్‌ల మార్పిడిని పోలీసులు గుర్తాచారు. వీటన్నింటి కంటే ముందే ఎనిమిది నెలలుగా వారి మధ్య మంచి స్నేహబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు. అంతే కాకుండా బాలిక సూసైడ్ నోట్ ఆధారంగా మరికొంత మంది వేధించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్యలు చేసుకోవద్దు: సీఎం
గత కొన్ని వారాల్లో, లైంగిక వేధింపుల కారణంగా మరో నాలుగు ఆత్మహత్యలు జరిగాయి, రెండు సందర్భాల్లో ఉపాధ్యాయులే కారకులుగా గుర్తించారు. తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ ఇటీవల ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసి, ప్రాణనష్టం "నన్ను కలవరపెడుతోంది, ఆత్మహత్యలు చేసుకోవద్దని అటువంటి నేరస్థుల గురించి ధైర్యంగ బయటకు చెప్పండి.. న్యాయం జరిగేలా చూస్తామని ఆయన వీడియో సందేశం విడుదల చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Abused, Chennai, Sexual harrassment, Student suicide, Suicide, Tamilandu, Woman suicide