మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ఓ స్టూడెంట్ ఏకంగా కాలేజీ ప్రిన్సిపాల్(College principal)పై పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఇండోర్Indoorలో జరిగిన ఈదారుణ సంఘటనలో ప్రిన్సిపల్‌ను ఆసుపత్రిలో చేర్పించారు. మూడ్రోజుల పాటు చావుతో పారాడి చివరకు ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు స్టూడెంట్‌ని అరెస్ట్ చేసారు. కేవలం తన మార్క్స్ లిస్ట్(Marks list)ఇవ్వలేదనే కోపంతోనే ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఈసంఘటన జరిగింది. నిందితుడు అశుతోష్ శ్రీవాత్సవ(Ashutosh Srivatsava)ను అదే రోజు అదుపులోకి తీసుకున్నారు. ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ పోసి హతమార్చిన స్టూడెంట్‌ని కఠినంగా శిక్షించాలని విద్యార్ధి, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రిన్సిపాల్‌ని చంపిన స్టూడెంట్..
యువకుల్లో నేరప్రవుత్తి విద్యార్ధి దశ నుంచే మొదలవుతోంది. కాలేజీలో బాగా చదువుకొని కొందరు ఉన్నత శిఖరాలను చేరుకుంటుంటే కొందరు ర్యాగింగ్ పేరుతో స్టూడెంట్స్‌ని,ప్రేమ పేరుతో అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ బీఫార్మసీ కాలేజీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అశుతోష్ శ్రీవాత్సవ ఈనెల 20తేదిన కాలేజీకి వెళ్లి ప్రిన్సిపాల్‌ను మార్కు లిస్టు ఇవ్వమని కోరాడు. అందుకు ప్రిన్సిపల్ విముక్త శర్మ ఇవ్వనని చెప్పారు. సెవెన్త్ సెమిస్టర్‌లో ఫెయిల్ అయిన కారణంగా ఇవ్వడం కుదరదని చెప్పడంతో శ్రీవాత్సవ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ పోసి సిగరెట్ వెలిగించుకునే లైటర్‌తో నిప్పంటించాడు.
పెట్రోల్ పోసి నిప్పంటించాడు..
స్టూడెంట్ చేసిన అఘాయిత్యంతో కాలేజీ సిబ్బంది వెంటనే ప్రిన్సిపాల్‌ను ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే రోజు స్టూడెంట్‌ని అరెస్ట్ చేశారు. 80శాతం శరీరం కాలిపోవడంతో ప్రిన్సిపాల్ విముక్త శర్మ మూడ్రోజుల పాటు చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున చనిపోయిందని ఆస్పత్రి వైద్యులు ప్రకటన విడుదల చేశారు.
పోలీసుల అదుపులో నిందితుడు..
స్టూడెంట్ మార్క్స్ లిస్ట్ ఇవ్వలేదనే చిన్న కారణంతో ఏకంగా కాలేజీ ప్రిన్సిపల్‌ను హతమార్చిన స్టూడెంట్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. విచారిస్తున్నారు. అదే కారణమా లేక ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా ..కాలేజీలోకి పెట్రోల్ ఎలా తీసుకొచ్చాడని ఆరా తీస్తున్నారు. కాలేజీలోని సీసీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Madhya pradesh, National News, VIRAL NEWS