చెన్నైలో దారుణం... వెంటాడి వేటాడి స్టూడెంట్‌ హత్య

నమూనా చిత్రం

అందరూ చూస్తుండగానే కత్తులతో వెంటాడి వేటాడి హత్య చేశారు. అందరూ ఈ దారుణాన్ని చూశారు కాని.. ఎవరూ అడ్డుకున్న ప్రయత్నం కానీ చేయలేదు. కనీసం పోలీసులకు సమాచారం కూడా ఇవ్వలేకపోయారు.

  • Share this:
    తమిళనాడులో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. చెన్నై నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నడిరోడ్డుపై ఓ యువకుడ్ని కొందరు అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే కత్తులతో వెంటాడి వేటాడి హత్య చేశారు. అందరూ ఈ దారుణాన్ని చూశారు కాని.. ఎవరూ అడ్డుకున్న ప్రయత్నం కానీ చేయలేదు. కనీసం పోలీసులకు సమాచారం కూడా ఇవ్వలేకపోయారు. అరుంబక్కం ప్రాంతంలోని డీజీ వైష్ణవ కాలేజీ సమీపంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు ఓ వ్యక్తిని వెంటాడారు. యువకుడు భయంతో పరుగులు తీస్తున్న విడిచి పెట్టలేదు. వెంటాడి మరీ కత్తులతో నరికి చంపారు. ఈ ఘటనను చూసిన కొందరు వీడియోలు తీయగా, మరికొందరు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.

    First published: