Murder in School : సీనియర్ విద్యార్థిని ఏడిపించినందుకు.. స్కూల్లోనే ఉరికించి... కత్తులతో దాడి...

Murder in School

Murder in School : పద్నాలుగు సంవత్సరాల విద్యార్థి తన సీనియర్ విద్యార్థిని వేధించినందుకు తోటి విద్యార్థులతో కత్తిపోట్లకు గురయ్యాడు.. బెదిరించేందుకు వెళ్లిన విద్యార్థుల మధ్య వాగ్వావాదం చోటు చేసుకోవడంతో క్లాస్ రూంలోనే వెంబడించి కత్తులతో పొడవంతో ఆ విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

  • Share this:
    చిన్న చిన్న తగదాలు ప్రాణాల మీదకు తెస్తాయి.. ఇలా చదువుకునే పిల్లల మధ్య అప్పుడప్పుడు వస్తున్న తగదాలు వారి ప్రాణాల మీదకే తెస్తున్నాయి. తెలియని తనంతో తోటి విద్యార్థులని కూడా చూడకుండా దాడులు చేయడంతోపాటు ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడని పరిస్థితులు ప్రస్థుతం నెలకొన్నాయి.

    రాయ్‌గఢ్‌లోని కైలాష్ నాథ్ కాట్జూ ప్రభుత్వ పాఠశాలలో సాగర్ టాండన్ (14) అనే కుర్రాడు చదువుకుంటున్నాడు. 9వ తరగతి చదివే సాగర్.. మధ్యాహ్నం గంట మోగగానే తరగతి గది నుంచి బయటకు వచ్చాడు. స్కూల్ బయట అతనితో ఇద్దరు యువకులు గొడవపడ్డారు. తన సీనియర్ క్లాస్‌కు చెందిన అమ్మాయి వెంటపడటం మానుకోవాలంటూ సాగర్‌ను బెదిరించారు. పిచ్చి చేష్టలు చేయొద్దంటూ అతన్ని కొట్టారు. ఆ సమయంలో ఆ అమ్మాయి కూడా అక్కడే ఉంది.అయితే సాగర్‌ను కొట్టడం చూసిన సీనియర్ విద్యార్థిని వాడిని భయపెడతారని మిమ్మల్ని తీసుకొచ్చా. ఎందుకలా కొడుతున్నారని ప్రశ్నించింది .ఇదే సమయంలో కోపం తెచ్చుకున్న సాగర్.. మనం మాట్లాడుకున్న మాటలు వీళ్లకెందుకు చెప్పావ్?'' అంటూ ఆమెపై కోపంతో చెయ్యి చేసుకున్నాడు. ఇలా ఆ అమ్మాయిని అతను కొట్టడాన్ని చూడగానే.. బెదిరిస్తున్న యువకుల ఆగ్రహం ఎక్కువైంది.. మా ముందే అమ్మాయిని కొడతావా అంటూ పిడిగుద్దులు గుద్దారు. దీంతో సాగర్ స్కూల్ లోపలికి పరిగెత్తాడు. దీంతో అతన్ని వెంబడించిన ఇద్దరు యువకుల్లో ఒకడు.. తన వద్ద ఉన్న కత్తితో సాగర్‌ను పొడిచేశాడు. అనంతరం నిందితులిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు.

    తీవ్రంగా గాయపడిన సాగర్‌కు కత్తిపోట్లతో రక్తం కారుతోంది.. అయినా ఆ విద్యార్థి స్కూల్‌లోని స్టాప్ రూం చేరుకుని అక్కడే పడిపోయాడు. ఇంతలోనే తేరుకున్న తోటి విద్యార్థులు అతని వెనకే రక్తం గుర్తులు పడటాన్ని గమనించిన విద్యార్థులు కూడా అతన్ని వెంబడించారు. రక్తపు మడుగులో పడిపోయిన సాగర్‌ను కాపాడేందుకు వాళ్లంతా కలిసి అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అయితే పరిస్థితి అప్పటికే విషమించడంతో జిల్లా అసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ సాగర్ మృత్యువాత పడ్డాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని సాగర్‌పై దాడి చేసిన ఇద్దరు యువకుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ గొడవకు కారణమైన అమ్మాయిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరో యువకుడిని కూడా గుర్తించామని, అతన్ని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.కాగా దాడికి పాల్పడిన ఇద్దరు కూడా మైనర్లు కావడంతో వారిపై జువైనల్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు
    Published by:yveerash yveerash
    First published: