Priyanka Kumari: పరీక్షకు హాజరయ్యేందుకు వెళ్లిన యువతి.. ఇలా జరుగుతుందని ఊహించని తల్లిదండ్రులు..

ప్రియాంక కుమారి

24 ఏళ్ల ప్రియాంక కుమారి యూనివర్సిటీలో హోమ్ సైన్స్ చదవుతోంది. ప్రస్తుతం హోమ్ సైన్స్ మూడో ఏడాది చదువుతున్న ప్రియాంక.. శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎగ్జామ్‌ నిమిత్తం యూనివర్సిటీకి వచ్చింది.

  • Share this:
    పరీక్షకు హాజరయ్యేందుకు యూనివర్సిటీకి వెళ్లిన ఓ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. ఆమె మృతదేహం స్టోర్‌ రూమ్‌లో ఉరికి వేలాడుతూ కనిపించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ యూనివర్సిటీలో చోటుచేసుకుంది. అయితే యువతి మృతిపై రకరకాల కథనాలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. వివరాలు.. 24 ఏళ్ల ప్రియాంక కుమారి యూనివర్సిటీలో హోమ్ సైన్స్ చదవుతోంది. ప్రస్తుతం హోమ్ సైన్స్ మూడో ఏడాది చదువుతున్న ప్రియాంక.. శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎగ్జామ్‌ నిమిత్తం యూనివర్సిటీకి వచ్చింది. ఆ తర్వాత స్టోర్‌ రూమ్‌లో ఆమె ఉరికి వేలాడుతూ కనిపించడం యూనివర్సిటీ సిబ్బంది గుర్తించారు.

    అనంతరం ఇందుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. అక్కడ వైద్యుల బృందం ప్రియాంక మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ పూర్తి చేశారు. అందులో ఉరి వేసుకోవడం వల్లే చనిపోయిందని తేలింది. అంతేకాకుండా ప్రియాంక శరీరంగా ఎటువంటి భౌతిక గాయాలు లేవని పోస్ట్‌మార్టమ్ నివేదికలో వైద్యులు పేర్కొన్నారు.

    అయితే ప్రియాంక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దీనిని హత్య కేసుగా నమోదు చేసుకని విచారణ చేపడుతున్నారు. ఇక, సోమవారం ప్రియాంక మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీ ప్రియాంక కేసులో నిజాలు బయటకు వచ్చేలా విచారణ సాగాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ప్రియాంక మృతికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

    ఇందుకు సంబంధించి ఎస్‌ఎస్‌పీ దినేష్‌ కుమార్ మీడియాతో మాట్లాడూతూ.. సోషల్ మీడియాలో జరుగుతన్న ప్రచారాలను ఖండించారు. కేసు దర్యాప్తును జగత్ రామ్ కనోజియాకు అప్పగించినట్టు తెలిపారు. క్యాంపస్‌లో విద్యార్థి మరణానికి అసలు కారణం తెలుసుకోవడానికి విచారణ కొనసాగుతుందని చెప్పారు. ప్రియాంక తల్లిదండ్రుల అనుమానాలను కూడా తొలగించే ప్రయత్నం జరుగుతుందన్నారు. తప్పుడు కథనాలను పోస్ట్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    Published by:Sumanth Kanukula
    First published: