స్టూడెంట్‌ను బలవంతం చేసిన టీచర్...గదిలోకి లాక్కెళ్లి..

కొందరు విద్యార్థినులు భయంతో అతడి దుశ్చర్యలను బయటకు చెప్పేవారు కాదు. దీంతో అదే ప్రాంతానికి చెందిన బాధితురాలు కొత్తగా కోచింగ్ సెంటర్ లో చేరింది. దీంతో ఆమెపై కన్నేసిన ఆ ట్యూషన్ టీచర్ ఆమెను వశపరుచుకోవాలని కుటిల ప్రయత్నం చేశాడు.

news18-telugu
Updated: January 18, 2020, 11:05 PM IST
స్టూడెంట్‌ను బలవంతం చేసిన టీచర్...గదిలోకి లాక్కెళ్లి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అతడు పేరుకే ట్యూషన్ టీచర్...కానీ అతడి దృష్టి మొత్తం తన దగ్గరికి వచ్చే అమ్మాయిల మీదే ఉంటుంది. కూతురు వయస్సు ఉన్న ఒక విద్యార్థినిపై కన్నేసిన ఈ కీచక ట్యూషన్ టీచర్, ఆమెతో తన పశువాంఛ తీర్చుకోవాలని చూశాడు. వివరాల్లోకి వెళితే ముంబైలోని తోడ్కోని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రముఖ కోచింగ్ సెంటర్ లో నిందితుడు హీరానందాని ట్యూషన్స్ చెబుతున్నాడు. అయితే తన వద్ద వచ్చే విద్యార్థినులపై నిందితుడు తరచూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. కాగా కొందరు విద్యార్థినులు భయంతో అతడి దుశ్చర్యలను బయటకు చెప్పేవారు కాదు. దీంతో అదే ప్రాంతానికి చెందిన బాధితురాలు కొత్తగా కోచింగ్ సెంటర్ లో చేరింది. దీంతో ఆమెపై కన్నేసిన ఆ ట్యూషన్ టీచర్ ఆమెను వశపరుచుకోవాలని కుటిల ప్రయత్నం చేశాడు.

అంతేకాదు తన చేంబర్ లోకి పిలిచి లోబరుచుకోవాలని ప్రయత్నం చేశాడు. దీంతో భయంతో బాధితురాలు అక్కడి నుంచి పారిపోయింది. ఇంటిసభ్యులకు ట్యూషన్ టీచర్ గురించి నిజం చెప్పడంతో, వారంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ట్యూషన్ మాస్టరును అదుపులోకి తీసుకున్నారు.

 

First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు