Home /News /crime /

STUDENT COMMITTED SUICIDE FOR UNABLE TO LISTENING ONLINE CLASSES IN PEDDAPALLI MS KNR

Online Classes: ఆన్లైన్ క్లాసులకు అడ్డొచ్చిన పేదరికం.. ప్రాణాలు తీసుకున్న విద్యార్థిని..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బంగారు భవిష్యత్ ఉన్న ఓ విద్యార్థినిని పేదరికం బలితీసుకుంది. ఆన్లైన్ తరగతులు వినేందుకు స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఆ విద్యార్థిని.. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన పెద్దపెల్లిలో చోటు చేసుకుంది.

  • News18
  • Last Updated :
    కోవిడ్ నేపథ్యంలో బడులు, కాలేజీలు ప్రారంభం కాలేదు. విద్యార్థులకు అకాడమిక్ ఈయర్ పోకూడదనే ఉద్దేశంతో ఆన్లైన్ క్లాసెస్ తో నెట్టుకొస్తున్నారు పంతుళ్లు. అయితే చాలా మంది విద్యార్ధి, విద్యార్థినిలకు స్మార్ట్ ఫోన్ లేక ఆన్లైన్ క్లాసెస్ వినకపోవడంతో తాము పాఠాలు వినడంలేదని.. పరీక్షల్లో తప్పుతామేమో అని క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. బంగారు భవిష్యత్ ఉన్న ఓ విద్యార్థినిని పేదరికం బలితీసుకుంది. ఆన్లైన్ తరగతులు వినేందుకు స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదనే మనస్తాపంతో డిప్లొమో విద్యార్థిని (18) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

    వివరాలు ఇలా ఉన్నాయి..పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూపోరట్ పల్లి గ్రామానికి చెందిన కోక రమేశ్-పల్లవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా చిన్న కుమార్తె (18) సిద్దిపేట జిల్లాలోని పెద్దకోడూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఆన్లైన్ తరగతులు జరుగుతున్న దృష్ట్యా.. తల్లిదండ్రులను స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని కోరింది. తండ్రి డీసీఎం డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. డబ్బు సరైన సమయంలో అందకపోవడంతో ఫోన్ కొనడంలో జాప్యమైంది. దీంతో ఆ యువతి తన చదువుకు ఆటంకం కలుగుతుందనే మనోవేదనకు గురైంది.

    ఇదీ చదవండి... బడి పాఠాలు వినమంటే.. ప్రేమ పాఠాలు నేర్చుకున్న బాలిక.. ప్రేమికుడి కోసం జిల్లాలు దాటిన వైనం

    గురువారం ఉదయం కుటుంబసభ్యు లంతా సమీపంలోని బంధువుల ఇంటికి శుభ కార్యానికి వెళ్లగా.. తాను తర్వాత వస్తానని చెప్పింది. కానీ వాళ్లందరూ వెళ్లాక ఇంట్లో ఉరేసుకుని మృతి చెందింది. కుమార్తె ఇంకా రావడం లేదని ఇంటికి వచ్చి చూడగా ఉరేసుకొని కనిపించింది. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో మృతిచెందింది.

    బాధితురాలి తల్లి పల్లవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా... తన మృతికి ఎవరూ కారణం కాదు అని.. ‘నా చావుకు నేనే కారణం’ అంటూ రాసిన ఆమె రాసిన లేఖ లభ్యమైంది. ఆమె మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు విలపించిన తీరు అందరినీ కన్నీరుపెట్టించింది.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Crime, Crime news, Peddapalli, Student suicide, Suicide, Telangana, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు