Sad: ఎంత పని చేశావ్ తల్లి.. ‘అమ్మా.. నాన్న నన్ను క్షమించండి.. మీకు మొఖం చూపించలేను’అని లేఖ రాసి ఆత్మహత్య చేసుకన్న యువతి..

స్నేహ

‘అమ్మా.. నాన్న నన్ను క్షమించండి. నేను మీకు మొఖం చూపించలేను. మీరు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అది నేను నిలబెట్టుకోలేకపోయాను’ అంటూ ఓ విద్యార్థిని సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది.

  • Share this:
    ‘అమ్మా.. నాన్న నన్ను క్షమించండి. నేను మీకు మొఖం చూపించలేను. మీరు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అది నేను నిలబెట్టుకోలేకపోయాను’ అంటూ ఓ విద్యార్థిని సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది. క్షణికావేశంలో ఆ యువతి తీసుకన్న నిర్ణయం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నెట్టివేసింది. ఎంసెట్ పరీక్షలో క్వాలిఫై కానందున తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పింది. ఆమె రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు పలువురిని కంటతడి పెట్టిస్తుంది. ఈ ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. నల్గొండ(Nalgonda) జిల్లా కనగల్ మండలం శాబ్థుల్లాపురానికి చెందిన కోయ రవీందర్ రెడ్డి, అరుణ దంపతుల కూతురుస్నేహా రెడ్డి(18). జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కాలేజ్‌లో ఇంటర్ చదివింది. ఆమె కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ఎంసెట్(Eamcet) పరీక్ష రాసింది. అయితే బుధవారం ఫలితాలు వెలువడగా.. స్నేహ క్వాలిఫై కాలేదు.

    దీంతో తీవ్ర మనస్తాపం చెందిన స్నేహ.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తల్లి అరుణ ఏఎన్‌ఎం(ANM) కాగా విధులపై కురంపల్లికి వెళ్లింది. తండ్రి వ్యవసాయ పనుల నిమిత్తం పొలం పనులకు వెళ్లాడు. ఇక, ఇంట్లో ఉన్న తమ్ముడిని తల్లిని తీసుకురమ్మని చెప్పి బయటికి పంపింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. ఫ్యాన్‌‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే అదే సమయంలో స్నేహ తండ్రి వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చినప్పటికీ.. ఇవేమీ తెలియక ఇంటి ఆవరణలో ఉండిపోయాడు.

    Jagtial: అతనికి అప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు.. తనను ప్రేమించాలని ఒత్తిడి తెచ్చిన యువతి.. తర్వాత ఏం జరిగిందంటే..

    ఇక, కొద్దిసేపటికి స్నేహ తమ్ముడు తల్లిని బైక్ మీద ఇంటికి తీసుకొచ్చాడు. వారు లోపలికి వెళ్లి చూడగా.. స్నేహ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన వారు స్నేహను కిందకు దించారు. అయితే అప్పటికే స్నేహ ప్రాణాలు కోల్పోయింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ దృశ్యాలు చూసిన స్థానికుల చేత కంటతడి పెట్టించాయి. తాను నేరుగా ఇంట్లోకి వెళ్లి ఉంటే కూతురుని కాపాడుకుని ఉండేవాడినని తండ్రి రవీందర్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యాడు.

    వంటింట్లో పనిచేసుకుంటున్న తల్లి.. కుక్క పిల్లతో ఆడుకుంటున్న బాలిక.. అయ్యో పాపం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం..

    ఇక, సూసైడ్ నోట్‌(Suicide Note)లో.. ‘సారీ అమ్మా.. నాన్న. నేను మిమల్ని ఫేస్ చేయలేను. మీకు నా మీద చాలా నమ్మకం ఉంది. కానీ నేను అది నిలబెట్టలేకపోయాను. నన్ను క్షమించండి. నేను ఎంసెట్‌లో క్వాలిఫై అవ్వలేదు. మీరేమో నాకు మంచి ర్యాంకు వస్తుందని అనుకున్నారు.. కానీ నేను కనీసం క్వాలిఫై కూడా కాలేదు. అందుకే మీకు నా మొఖం ఎలా చూపించాలో అర్థం కావడం లేదు. అందుకే ఇలా చేస్తున్నాను. మమ్మీ డాడీ.. నన్ను క్షమించండి. ఐ మిస్ యూ’అని స్నేహ పేర్కొంది.
    Published by:Sumanth Kanukula
    First published: