• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • STUDENT COMMIT SUICIDE AFTER UNBEARABLE ONLINE GANG HARASSMENT FOR MONEY IN NIZAMABAD FULL DETAILS HERE HSN NZB

హైదరాబాద్ లో స్టడీ.. ఒకే ఒక్క ఘటన ఆ కుర్రాడి ప్రాణాలను తీసింది.. పరువు పోతుందని సొంతూరికి వచ్చి మరీ..

హైదరాబాద్ లో స్టడీ.. ఒకే ఒక్క ఘటన ఆ కుర్రాడి ప్రాణాలను తీసింది.. పరువు పోతుందని సొంతూరికి వచ్చి మరీ..

శ్రీకాంత్ (ఫైల్ ఫొటో)

నేనొక విద్యార్థిని. చదువుకుంటున్నాను. నా దగ్గర లక్షల్లో డబ్బు ఉండదు. ఖర్చుల కోసం మా వాళ్లు కొన్ని వేలు మాత్రమే ఇస్తారు. నా దగ్గర 24 వేల రూపాయలు ఉన్నాయి. అవి తీసుకుని నన్ను వదిలేయండి. ప్లీజ్.. అని ఆ కుర్రాడు వేడుకున్నా..

 • Share this:
  ఎలాంటి పరిచయంలేని ఓ అమ్మాయి ఆన్ లైన్ లో పరిచయం అయితే ఎంతో సాధించినట్లుగా పిలవుతారు ఈ తరం కుర్రాళ్ళు. కానీ ఆ పరిచయం ఎంతటి ఉపద్రవాన్ని తీసుకువస్తుందో తెలియదు. మాటల్లో పెట్టి రెచ్చగొట్టి వారి అందాలతో బుట్టలో వేసుకుంటారు. మొదట స్నేహం నటించి, ఆ తర్వాత ప్రేమిస్తున్నానంటూ వల విసురుతారు. చివరికి వీడియో కాల్స్ చేసి నగ్నంగా కనిపించిన దృశ్యాలను చిత్రీకరించి డబ్బులు కొల్లగొట్టే గ్యాంగ్ కు ఓ యువకుడు చిక్కాడు. ఆ యువకున్ని డబ్బుల కోసం బెదిరించడంతో తన వద్ద ఉన్నదంతా ఇచ్చేశాడు. అయినా బెదిరింపులు ఆగకపోవడంతో చివరరకు ఆ యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం కోస్లీ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ విఠల్ తనయుడు శ్రీకాంత్. హైద్రాబాద్‌లోని పంజాగుట్టలో క్షత్రియ హోటల్ మెనేజ్ మెంట్ సంస్థలో హోటల్ మెనేజ్ మెంట్ చదువుతున్నాడు. ఇటీవల కాలంలో శ్రీకాంత్ కు ఒక గుర్తు తెలియని యువతి నుంచి మెసేజ్ వచ్చింది. దానికి స్పందించిన శ్రీకాంత్ సదరు నెంబర్‌కు కాల్ చేశాడు. నాటి నుంచి యువతి, శ్రీకాంత్‌ల మధ్య స్నేహం కుదిరింది. ఆ స్నేహం వీడియా కాలింగ్ చేసుకునే వరకు వెళ్ళింది. వారి మధ్య బంధం మరింత పెరగడంతో ఇద్దరు ఒకరినోకరు పరస్పరం నగ్న వీడియాలను షేర్ చేసుకున్నారు. ఆ తర్వాతే అసలు డ్రామా మొదలయింది. మోసపోయాన్న విషయం మనోడికి తెలిసింది. యువతి ఆ వీడియోలను రికార్డ్ చేసి తన గ్యాంగ్ సభ్యులతో కలిసి శ్రీకాంత్‌ను బ్లాక్ మెయిల్ చేసింది.
  ఇది కూడా చదవండి: హైదరాబాద్ హాస్టల్లో ఘోరం.. నాన్నా.. నన్ను క్షమించు.. అన్నా.. నేను తప్పు చేయలేదురా అంటూ.. మెసేజ్ పెట్టి మరీ..

  ‘నీ నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతాము. పెట్టకుండా ఉండాలంటే లక్షల్లో డబ్బులు పంపు’ అంటూ ఆ గ్యాంగ్ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే శ్రీకాంత్ ‘నేనొక స్టూడెంట్‌ను. మా అమ్మానాన్నలు ఖర్చుల కోసం వేలల్లో మాత్రమే డబ్బులు ఇస్తుంటారు. మీరు అడిగినన్ని లక్షలను తెచ్చి ఇవ్వలేను. నా దగ్గర కేవలం 24 వేల రూపాయలే ఉన్నాయి. ఇవి తీసుకుని నన్ను వదిలేయండి ప్లీజ్..’అని వేడుకుని ఆ డబ్బులను వారి అకౌంట్ కు పంపాడు. కానీ ఆ గ్యాంగ్ మాత్రం లక్షల్లో డబ్బులు ఇవ్వాలని, లేకపోతే వీడియోలను సోషల్ మీడియాలో పెడుతామని బెదిరించింది. దీంతో సోషల్ మీడియాలో పెడితే పరువు పోతుందని మార్చి 27న హైద్రాబాద్ నుంచి తన స్వగ్రామం కోస్లీకి వచ్చాడు. పొలానికి వెళ్లి అక్కడే పురుగుల మందు తాగి అత్మహత్య యత్నం చేశాడు. ఉదయం పూట పోలానికి వెళ్లిన తండ్రి అక్కడ శ్రీకాంత్‌ను అపస్మారక స్థితిలో చూసి నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్ కు తరలించారు. హైద్రాబాద్ లో చికిత్స పోందుతు మంగళవారం రాత్రి శ్రీకాంత్ మృతి చెందాడు. కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
  ఇది కూడా చదవండి: మేడమీద గదిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. అర్ధరాత్రి అక్క అదృశ్యం.. తల్లిదండ్రులతో కలిసి ఆమె కోసం వెతుక్కుంటూ వెళ్తే..
  Published by:Hasaan Kandula
  First published: