Home /News /crime /

STUDENT BECOME THIEF TO PAY SCHOOL FEE AS HIS FATHER GETS PAY CUT DUE TO CORONA BA

స్కూల్ ఫీజు కోసం దొంగగా మారిన విద్యార్థి.. ఎంత దయనీయ ఘటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బల్వంత్ ఎన్‌క్లేవ్‌లో నివసించే సచిన్ శర్మ అనే వ్యక్తి బ్యాంకులో నగదు డిపాజిట్ చేయడానికి వెళ్తుండగా, అతడిని వెంబడించి నిర్మానుష్య ప్రాంతంలో గన్‌తో బెదిరించారు. అతడి వద్ద బ్యాగులో ఉన్న రూ.5.35 లక్షల నగదును దోచుకున్నారు.

    కరోనా వైరస్ ఎంతో మంది కడుపు కొట్టింది. ఆ విద్యార్థి జీవితం మీదే కొట్టింది. చదువు కోవడానికి ఫీజులకు డబ్బుల్లేక దొంగగా మార్చింది. కరోనా కారణంగా పెద్దగా ఉత్పత్తి లేదని ఆ బాలుడి తండ్రి పని చేసే కంపెనీ జీతంలో కోత పెట్టింది. దీంతో ఆ బాలుడు స్కూల్ ఫీజు చెల్లించలేకపోయాడు. చివరకు చదువు కోవాలనే ఆకాంక్షతో అతడు తన స్నేహితులతో కలసి దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. ఉదమ్‌సింగ్ నగర్ జిల్లాలో రుద్రపూర్ అనే సిటీ ఉంది. ఆ నగరంలో ఓ ప్రముఖ పాఠశాలలో ఓ బాలుడు చదువుతున్నాడు. అతడి తండ్రి స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. కరోనా వైరస్ కారణంగా ఫ్యాక్టరీ కొన్నాళ్లు మూత పడింది. తెరిచిన తర్వాత కూడా కొంతమంది ఉద్యోగులతోనే పని నడపాలనే నిబంధనల కారణంగా అతడికి పెద్దగా పని దొరకలేదు. జీతంలో కూడా కోత పడింది. మరోవైపు తాను చదువుతున్న స్కూల్ నుంచి ఫీజులు చెల్లించాలనే ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఓ వైపు తండ్రి ఫీజు చెల్లించలేని పరిస్థితి. మరో వైపు స్కూలు నుంచి ఫీజు చెల్లించాలనే ఒత్తిడి. ఈ క్రమంలో బాలుడు ఏకంగా దొంగతనానికి ఒడిగట్టాడు.

    స్కూల్ ఫీజు కోసం దొంగతనం చేయాలనుకున్న బాలుడు ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్‌తో చెప్పాడు. వారు కూడా అందుకు అంగీకరించారు. ఎవరిని దోచుకోవాలనే ప్లాన్ వేశారు. స్థానికంగా బల్వంత్ ఎన్‌క్లేవ్‌లో నివసించే సచిన్ శర్మ అనే వ్యక్తి బ్యాంకులో నగదు డిపాజిట్ చేయడానికి వెళ్తుండగా, అతడిని వెంబడించి నిర్మానుష్య ప్రాంతంలో గన్‌తో బెదిరించారు. అతడి వద్ద బ్యాగులో ఉన్న రూ.5.35 లక్షల నగదును దోచుకున్నారు. బాధితుడు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు స్థానికంగా అందుబాటులో ఉన్న సీసీటీవీలను పరిశీలించారు. మొత్తానికి ఈ చోరీకి పాల్పడిన వారిలో నలుగురిని పట్టుకున్నారు. ఆ పిల్లలను విచారించగా, అసలు విషయం బయటపెట్టారు. తన తండ్రి స్కూలు ఫీజులు చెల్లించలేకపోయినందుకు ఇలా దొంగతనం చేయాల్సి వచ్చిందని చెప్పాడు. పరారీలో ఉన్న ఐదో కుర్రాడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

    గతంలో ఆన్ లైన్ క్లాసుల కోసం మొబైల్ ఫోన్ చోరీ
    గతంలోనూ ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. తన తండ్రికి స్కూలు ఫీజు కట్టేంత స్థోమత లేకపోవడంతో ఓ బాలిక మొబైల్ ఫోన్ చోరీ చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. ఓ ప్రైవేట్ డిటెక్టివ్‌కి చెందిన మొబైల్ ఫోన్‌ను చోరీ చేసి, దాన్ని తాకట్టు పెట్టింది. ఆ డబ్బులతో తన స్కూల్ ఫీజు కట్టింది. ఆ బాలిక క్లాస్ 11 చదువుతోంది. అందులో 71 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఆ తర్వాత క్లాస్ 12లో కొనసాగడానికి డబ్బులు లేక ఇలా చేశానని చెప్పింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: School fees, Uttarakhand

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు